బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ విషయంపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేసారు . బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై కేసులు పెట్టడంపై స్పందిస్తూ.. తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు.
దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అన్నారు. ఒకవేళ నేను అలాంటి ప్రమోషన్లు చేయాల్సి వస్తే వోడ్కాని ప్రమోట్ చేస్తా అని అన్నారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మా నుండి వస్తున్న సినిమా “శారీ”(Saree Movie) విషయానికొస్తే, ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం చాలా కామన్ అయిపోయింది, కానీ దాని వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు ఏ రకంగా ఉంటాయి అన్నదానిపై “శారీ” సినిమా రూపొందింది.
“శారీ”లో కీలకమైన పాత్రలలో సత్య యాదు, ఆరాధ్యా దేవి నటిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరి కృష్ణకమల్ మాట్లాడుతూ, ఆరాధ్యా, సత్య చక్కగా నటించారని, సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తెలిపారు.