బూతు సినిమాలకు కేరాఫ్ గా ఒకప్పుడు నిలిచిన షకీలా జీవితం ఆధారంగా షకీలా పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. ఈ బయోపిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా 2020 డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అయితే ఓటిటి బిజినెస్ కాకపోవటంతో ఇన్నాళ్లూ బయిటకు రాలేదు. ఇంద్రజీత్ లంకేష్ దర్వకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనకి షకీల అనగానే ఓ రకమైన సినిమాలే గుర్తొస్తాయి. కానీ ఆమె జీవితంలోనూ ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులు ఉన్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ షకీల బయోపిక్‌ను నిర్మించారు.
గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్న షకీలా శృంగార తారగా ఎలా మారాల్సివచ్చిందన్నది ఎమోషనల్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడని అప్పుడు టాక్ వచ్చింది. దాంతో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువ కావడంతో కూడా మైనస్‌గా మారింది.
సినిమాలో ఏం చూపించారు
కుటుంబ బాధ్యతల కారణంగా ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం కారణంగా అడల్డ్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటుంది షకీలా. కొద్ది రోజుల్లోనే పాపులర్ పోర్న్‌స్టార్‌గా మారిపోతుంది. అగ్ర హీరోల సినిమాలు సైతం షకీలా సినిమాలతో పోటీపడలేకపోయాయి.
మలయాల స్టార్ హీరో సలీమ్…షకీలా పేరు ప్రఖ్యాతులను దిగజార్చేందుకు కుట్రలు పన్నుతాడు. షకీలాపై సలీమ్ పగనుపెంచుకోవడానికి కారణం ఏమిటి? సలీమ్ కుట్రల వల్ల షకీలా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ.