సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం “సికందర్” రంజాన్ సందర్భంగా ఆదివారం (మార్చ్ 30) రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. భారీ అంచానాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది .

మొదటి రోజు మినిమం రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని మేకర్స్ అంచనా వేసారు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో కేవలం రూ.30 కోట్లు లోపు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం.

అయితే ఉన్నంతలో రంజాన్ పండుగ సెంటిమెంట్ కొన్ని ఏరియాల్లో వర్కౌట్ అయ్యినట్లు ట్రేడ్ వర్గాల చెప్తున్నాయి. ముస్లింలు బాగా ఉన్న ప్రాంతాల్లో కలెక్షన్స్ కనపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో రెండో రోజు ఈ చిత్రం యొక్క అతిపెద్ద జంప్ కనిపించింది, ఇక్కడ ముస్లిం-ఆధిపత్య కేంద్రాలలో కలెక్షన్లు రెట్టింపు అయ్యాయి. బీహార్ మరియు నిజాం/ఆంధ్రా కూడా కొంత గ్రోత్ ని చూస్తున్నాయి.

అలాగే పరిమిత ముస్లిం జనాభా కారణంగా గుజరాత్ లో గణనీయంగా 25-30% తగ్గింది. ఈద్ సెలవుదినం ప్రస్తుతానికి కలెక్షన్స్ కు ఉపయోగపడింది.

ఏదైమైనా సికంద‌ర్ సినిమా సల్మాన్ కెరీర్లో మరో డిజప్పాయింట్ సినిమాగా చ‌రిత్ర‌లో నిలిచి పోయింది. కంటెంట్ ప‌రంగా తేలి పోవ‌డంతో సౌర్త్ లో కాదు .. అటు బాలీవుడ్ లోనూ ఈ సినిమాను ప‌ట్టించుకునే వారే లేకుండా పోయారు. నార్త్ లో సైతం సల్మాన్ సినిమాని ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా, పలు చోట్ల ఈ సినిమా చూసే వారే లేకుండా పోవ‌డంతో థియేట‌ర్లు సగం ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి.

, ,
You may also like
Latest Posts from