ఇప్పటి జనరేషన్ లో ఎలాంటి జానర్ అయినా తిరుగు లేకుండా చేయగల శక్తి ఉన్న హీరో ఎన్టీఆర్. ఇప్పటికే మైథాలజీ, సోషియో ఫాంటసీ సినిమాలు తారక్ చేసి చూపించాడు. అందుకే ఆయన మీద మిగతా డైరక్టర్స్ ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గార్ కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు. ఇప్పుడు ఇదే విషయం మరోసారి కొరటాల శివ కూడా తేల్చి చెప్పారు.

జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో ‘దేవర’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ అక్కడ మీడియాని కలిసారు. ఈ క్రమంలో కొరటాల శివ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ రీమేక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కొరటాల శివ మాట్లాడుతూ… సౌత్ ఇండియాలో కె.విశ్వనాథ్ అనే లెజెండరీ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ‘సాగర సంగమం’ అనే సినిమాను తెరకెక్కించారు. అది ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయిందని.. అందులో కమల్ హాసన్ నటించారని.. ఆ సినిమా అంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్‌కి ఎంతో ఇష్టమని కొరటాల తెలిపారు. ఇక ఆ చిత్రాన్ని ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరైనా రీమేక్ చేస్తే, కేవలం ఎన్టీఆర్ మాత్రమే వారికి ఛాయిస్ అని కొరటాల కామెంట్ చేశాడు.

ఈ నేపధ్యంలో ‘సాగర సంగమం’ చిత్రాన్ని నిజంగానే రీమేక్ చేస్తే, ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొరటాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

,
You may also like
Latest Posts from