చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కామెడీ పండించటంలో పీక్స్ లో ఉంటారు. ఇక వీరిని డైరక్ట్ చేయబోయేది అనీల్ రావిపూడి అయితే చెప్పేదేముంది. ఇంక రచ్చ రచ్చే. ఇప్పుడీ కాంబినేషన్ కు రంగం సిద్దమైంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు వెంకటేశ్ (Venkatesh). ఇప్పుడాయన వచ్చే సంక్రాంతికి చిరంజీవితో (Chiranjeevi) కలిసి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు హీరోగా ఓ సినిమా ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంటర్ట్నమెంట్ తో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం (Mega 157) రూపొందనుంది. ఇందులో వెంకటేశ్ ఓ ముఖ్య పాత్రధారిగా చిరంజీవితో కలిసి సందడి చేయనున్నారని సమాచారం.
దీంట్లో వెంకటేష్ ది అతిథి పాత్రేం కాదని.. చాలా ప్రాధాన్యమున్న పాత్రని తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకునే అవకాశముంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసి రోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.