పొలిటికల్ డ్రామా ఇండియన్ 2, పాన్-ఇండియా స్దాయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న గేమ్ చేంజర్… రెండూ బ్యాక్‌ టూ బ్యాక్ ప్లాపులే. దాంతో స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు సొంత ప్రాజెక్టులకూ నిర్మాతలు వెతుకుతున్న పరిస్థితి. ఇదే సమయంలో, ఆయన కొడుకు అరిజిత్ మాత్రం హీరోగా ఎంట్రీకి సన్నద్ధమవుతున్నట్టు తమిళ ఇండస్ట్రీకి టాక్!

ఇప్పటికే శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా నిలదొక్కుకుని, కొన్ని హిట్స్ కూడా కొట్టేసింది. ఇప్పుడు కొడుకు అరిజిత్ హీరోగా వస్తున్నాడంటే… ఇది ప్లాన్‌ చేసుకున్న ఫ్యామిలీ ఎంట్రీ అంటున్నారు!

దర్శకుల మధ్య పోరు: శంకర్ కొడుకును డైరెక్ట్ చేయనుంది ఎవరు?

అరిజిత్ ప్రస్తుతం ఏ.ఆర్. మురుగదాస్ వద్ద మధరాసి అనే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. గేమ్ చేంజర్ కు కూడా శంకర్ పక్కన అసిస్టెంట్‌గా ఉన్నాడని, స్వయంగా శంకర్‌నే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే, అరిజిత్‌కి హీరోగా లాంచ్ చేసే అవకాశంపై ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు రేస్‌లో ఉన్నారు.

అట్లీ అసిస్టెంట్ దర్శకత్వంలో అరిజిత్ హీరోగా ఎంట్రీ ఇస్తాడన్న టాక్‌!

ఇక మరో బిగ్ నేమ్… ప్రభుదేవా కూడా అరిజిత్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట!

ఫైనల్ క్లారిటీ ఎప్పుడంటే?

ఇప్పటికే స్టోరీ ల డిస్కషన్ ఓ దశలోకి వచ్చేసిందట. ఈ సంవత్సరం చివర్లో షూటింగ్ మొదలు కానుంది అన్నది ఇండస్ట్రీ టాక్. అధికారిక ప్రకటన ఎప్పుడైనా వచ్చేయొచ్చు. శంకర్ డైరెక్ట్‌గా ఫెయిలైనా, తండ్రిగా తన కొడుకుకు స్టార్ లాంచ్ ఇవ్వాలన్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది.

“ఇది లాంచ్ ఆఫ్ లెగసీనా… లేక బ్రాండ్ రీడెంప్షనా?”

ఇండియన్ సినిమాల్లో ఓ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది — డైరెక్టర్లు హీరోలు కావడం, హీరోలు డైరెక్టర్లు కావడం… ఇప్పుడు డైరెక్టర్ కుమారులు హీరోలు అవుతారంటే… ఈ ఇంట్రెస్టింగ్ జంప్‌లో అరిజిత్ శంకర్ తన ఫ్లేస్ ఎక్కడ ఫిక్స్ చేస్తాడో చూడాలి మరి!

,
You may also like
Latest Posts from