డైరక్టర్ శంకర్ సినిమా అంటే ఒకప్పుడు ఓ రేంజిలో క్రేజ్. అయితే ‘ఇండియన్ 2’ మరియు ‘గేమ్ ఛేంజర్’తో బ్యాక్-టు-బ్యాక్ ఎదురుదెబ్బలు ఆయన్ని దారుణమైన పరిస్దితుల్లోకి తోసేసాయి. ఆయన భారీ-స్థాయి ప్రాజెక్ట్‌ల కోసం నిర్మాతలు ధైర్యం చేస్తారా అనే సందేహాలు మొదలవుతున్నయి. ‘గేమ్ ఛేంజర్’ శంకర్ కు గేమ్ ఛేంజర్‌గా ఉండాల్సి ఉండగా, దాని దారుణమైన బాక్సాఫీస్ రిజల్ట్ ఆయన భవిష్యత్ సినిమాల నిర్మాతలను పునరాలోచించుకునేలా చేసింది. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయనకు హీరో సెట్ అయ్యాడని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

తమిళ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం శంకర్ ఇప్పుడు విక్రమ్ కుమారుడు ధృవ్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

శంకర్ విక్రమ్ తో అపరిచితుడు, ఐ సినిమాలు చేశారు. దాంతో ఇప్పుడు ఆయన కొడుకుతో సినిమా చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఏదైమైనా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. కానీ ఈ సినిమా విడుదలై తర్వాత దారుణంగా నిరాశపరిచింది.

దాదాపు 500కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ సినిమాకు కలెక్షన్స్ పడిపోయాయి.

,
You may also like
Latest Posts from