వివాదాలకి దూరంగా ఉండే నటుడిగా పేరొందిన రాజీవ్ కనకాల ఇప్పటివరకు ఎన్నో ప్రశంసల పొందిన సినిమాలు చేశారు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే రాజీవ్ ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు – అదే ఒక ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన కేసు కారణంగా!
రాచకొండ పోలీసులు రాజీవ్ కనకాల నివాసానికి వెళ్లి అతనికి నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పసుమాముల రెవెన్యూ పరిధిలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో ఉన్న ఓ ఫ్లాట్‌ను గతంలో రాజీవ్ కనకాల విజయ్ చౌదరి అనే వ్యక్తికి రూ.70 లక్షలకు అమ్మారు.
తర్వాత విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను శ్రవణ్ రెడ్డికి అమ్మినా, ఆయనకు ఇప్పటివరకు ఫ్లాట్ హస్తాంతరణ (పజెషన్) జరగలేదు. దీంతో శ్రవణ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించగా, ఆయన ఫిర్యాదుతో విజయ్ చౌదరి, రాజీవ్ కనకాలపై కేసు నమోదు అయింది.
ఈ కేసులో రాజీవ్ కనకాల A2 (ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండో వ్యక్తి) గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చబడ్డారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడూ సంయమనం పాటించే రాజీవ్ కనకాల ఇలా వార్తల్లోకి రావడం నిజంగా ఆశ్చర్యకరం!