సినిమా వార్తలుసోషల్ మీడియా

రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో కొత్త స్కాం ! మీ వాట్సాప్‌ కూడా సేఫ్ కాదు?

డిజిటల్ యుగం వేగంగా ముందుకు దూసుకెళ్తున్న కొద్దీ… సైబర్ మోసగాళ్లు పడుతున్న వలలు ఇంకాస్త ప్రమాదకరంగా మారుతున్నారు.
డిజిటల్ అరెస్టులు, నకిలీ ఐడీలు, సెలబ్రిటీల పేరుతో స్కామ్‌లు, వాట్సాప్ ఫేక్ చాట్స్ — ఇలా ఎన్నో రకాలుగా సాధారణ ప్రజలతో పాటు స్టార్ హీరోయిన్లను కూడా బురిడీ కొడుతున్నారు. ఎవరు పడితే వారు టార్గెట్… మొబైల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రమాద పరిధిలోనే ఉన్నారు. ఇక తాజాగా ఈ దుష్టుల బారిన పడిన పేరు — టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

“నా పేరుతో నకిలీ వాట్సాప్ చాట్… జాగ్రత్త!” – రకుల్ షాకింగ్ అలర్ట్

సోషల్ మీడియాలో రకుల్ పెట్టిన తాజా పోస్ట్ అభిమానుల్లో కలవరపరిచింది. తన పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ చాట్ చేస్తున్నాడని గుర్తించిన రకుల్, వెంటనే అలర్ట్ జారీ చేసింది.

“హాయ్ అందరికీ… నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నారని తెలిసింది. ఆ నెంబర్ నాది కాదు. ప్లీజ్ స్పందించకండి. వెంటనే బ్లాక్ చేయండి.” అంటూ ఎక్స్ (Twitter) లో స్పష్టంగా తెలిపింది.

“350 కోట్ల వాట్సాప్ అకౌంట్స్ డేటా లీక్… పెరుగుతున్న పన్నాగాలు”

నిన్న మొన్నటి వరకు ఇది చిన్న విషయమని అనుకునే వాళ్లకు… కేవలం వారం క్రితమే ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల డేటా లీక్ అయిందనే వార్త షాక్ ఇచ్చింది. దీంతో ఫేక్ నంబర్లు, ఫేక్ చాట్స్, సెలబ్రిటీ పేర్లను దుర్వినియోగం చేస్తూ మోసాలు మరింత పెరిగాయి.

ఇక సెలబ్రిటీలు కూడా సేఫ్ కాదు!

ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా లక్ష్యాలే అవుతున్నారు. ఇటీవల కన్నడ హీరో ఉపేంద్ర భార్య కూడా పెద్ద సైబర్ స్కామ్‌కు గురైన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.

సైబర్ కేటుగాళ్ల “కొత్త రకుల్ స్కాం” ఏం చెబుతోంది?

ఎవరి పేరు అయినా వాడొచ్చు

ఏ నెంబర్ నుంచైనా మెసేజ్ పంపొచ్చు

ఒక “హాయ్” తోనే భారీ మోసం మొదలు కావచ్చు

అని మరోసారి నిరూపిస్తోంది.

వెంటనే గుర్తుచేసుకోండి — డిజిటల్ యుగంలో ముందు జాగ్రత్తే రక్ష!

నకిలీ నంబర్లను నమ్మొద్దు. వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద చాట్స్‌కి స్పందించొద్దు. “సెలబ్రిటీ” అని చెప్పే ప్రతి మెసేజ్ నిజం కాదు.

Similar Posts