
సినిమాకు బజ్ లేదు.. రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వమంటూ రామ్ పై ఒత్తిడి?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి హిట్ పడింది ఎప్పుడంటే? ఆరేళ్ల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ టైంలో. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్స్’, ‘స్కంధ’, ‘డబుల్ ఇస్మార్ట్’ — వరుసగా డిజాస్టర్లు. ఇలాంటి స్టేజ్‌లో రామ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేయించిన సినిమా — “ఆంధ్ర కింగ్ తాలూకా”. హీరో–అభిమాని బాండింగ్ మీద నడిచే ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకుడు. రామ్ ఫ్యాన్ పాత్రలో, ఉపేంద్ర హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపిస్తున్నారు.
టీజర్, ట్రైలర్ డీసెంట్ టాక్ తెచ్చినా… అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో బజ్ మాత్రం లేదు. అయినా, ఆశ్చర్యం ఏమిటంటే— ఈ చిత్రానికి రూ.27 కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయింది!
అసలు డ్రామా: రామ్ పారితోషికం రీఫండ్ డిమాండ్?
ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రారంభమైంది…
రామ్‌కు మొదట నిర్మాతలు ₹30 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ సినిమాకు బజ్ తగ్గిపోవడంతో, బడ్జెట్ ₹70 కోట్ల దాకా పెరిగిపోవడంతో… ఇప్పుడు రికవరీ కష్టమని భావించిన మేకర్స్, రామ్ పారితోషికం తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చారట!
అంతే కాదు…
“₹30 కోట్ల బదులు ₹20 కోట్లకే తగ్గించుకోంచండి” అని రామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో రచ్చ రేపుతోంది.
అంటే రామ్ 10 కోట్లు తిరిగి ఇవ్వాలా?!
ఇది ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
సాధ్యం కాని టార్గెట్? హిట్ కావాలంటే…
ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రకారం మూవీకి బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.28 కోట్లు షేర్ రావాలి. అంటే దాదాపు ₹55+ కోట్ల గ్రాస్ కావాలి.
పాజిటివ్ టాక్ వస్తే సాధ్యమే కానీ… ఫ్యాన్స్, ట్రేడ్ అన్ని రామ్ డిసిషన్ మీదే ఫోకస్ పెట్టాయి — వెనక్కి ఇస్తాడా? కట్ చేసుకుంటాడా? లేక స్ట్రిక్ట్‌గా స్టాండ్ తీసుకుంటాడా?
ఈ రోజు రాత్రే క్లారిటీ!
యు/ఏ సర్టిఫికేట్ పొందిన సినిమా ఈరోజు నుంచే ఓవర్సీస్ ప్రీమియర్స్‌కి వెళ్తోంది. మొదటి షో రిపోర్ట్స్‌తోనే సినిమాలో ఎంత బలం ఉందో తెలుస్తుంది.
కానీ ప్రస్తుతం అందరి మైండ్‌లో ఒక్క ప్రశ్న: రామ్ నిజంగా పారితోషికం తగ్గిస్తాడా? లేక నిర్మాతలే వెనక్కి తగ్గుతారా?
థియేటర్ లెక్కలు కంటే…
ఇప్పుడంతా రామ్ రీమ్యూనరేషన్ వార్ వైపే చూపులు!
