నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే శృతిహాసన్, ఒక్కసారిగా మౌనాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్పింది. “కొంతకాలం నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుంది… డిజిటల్ డిటాక్స్ అవసరమైంది” అని ఓ మెసేజ్ ద్వారా ప్రకటించింది.

కానీ ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే దానిపై ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవలే శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. హ్యాకర్లు ఆమె ఖాతాలో క్రిప్టో యాడ్స్ పెడుతూ దాన్ని దుర్వినియోగం చేశారు. చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత తన ఖాతా తిరిగి పొందింది.

అయితే ఖాతా రికవరీ అయిన కొద్ది రోజులకే ఈ డిటాక్స్ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది నిజంగా పర్సనల్ బ్రేక్‌నా? లేక “కూలి” సినిమా ప్రమోషన్‌లో ఫ్రెష్‌గా మెరిసేందుకు చేసిన ప్లానా?

ఇక అసలు ట్విస్టు ఏంటంటే – రోజూ ఏదో ఒక పోస్టుతో ఫాలోవర్లను ఎంటర్టైన్ చేసే శృతి… ఈ గ్యాప్ ఎంతకాలం కొనసాగుతుందో అన్నది అభిమానులకు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది!

, ,
You may also like
Latest Posts from