బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి జాతిపిత ఆర్డీ బర్మన్ అని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ పాకిస్థాన్ దేశ పితామహుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“మహాత్మా గాంధీ జాతి పితామహుడు.. భారతదేశానికి కాదు. పొరపాటున మహాత్మా గాంధీని మన దేశానికి జాతిపిత అని పిలిచారు.భారతదేశం అప్పటికే స్థిర‌ప‌డి ఉంది. తరువాత పాకిస్తాన్ భారతదేశం నుండి వేరు అయింది. గాంధీని భారతదేశానికి జాతిపిత అని తప్పుగా పిలుస్తారు. పాకిస్తాన్ ఉనికికి ఆయనే కారణం. కాబట్టి మహాత్మా గాంధీ పాకిస్థాన్ దేశ పితామహుడు” అని సింగర్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై ఓ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేయమని పోలీస్ లను ఆశ్రయించారు ఓ సామాజిక కార్యకర్త.

మహాత్మా గాంధీ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని పూణేకు చెందిన సామాజిక‌ కార్యకర్త దేశ్ పాండే డిమాండ్ చేశారు. పిటిఐ క‌థ‌నం ప్ర‌కారం… అభిజీత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పూణే పోలీసులను అత‌డు ఆశ్రయించారు.

గాంధీ భారత జాతిపిత కాదు.. పాకిస్తాన్ జాతిపిత అని వ్యాఖ్యానించి గాంధీజీని అవ‌మానించాడ‌ని ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌. అత‌డి మూర్ఖ‌త్వం అంటూ ఫిర్యాదులో కొట్టి పారేసాడు. ఇది స్వాతంత్య్ర‌ సమరయోధుడిపై ఆయనకున్న ద్వేషాన్ని చూపిస్తుందని వాదించారు. గాంధీజీని అవ‌మానించ‌డమే కాదు స‌మాజంలో చీలిక తెస్తున్నాడ‌ని అభిజీత్ పై స‌ద‌రు వ్య‌క్తి ఫిర్యాదు చేసాడు. ద‌క్క‌న్ జింఖానా పీఎస్‌కు ఫిర్యాదు అందించాడ‌ని దేశ్ ముఖ్ న్యాయవాది కూడా పేర్కొన్నారు.

, ,
You may also like
Latest Posts from