
మొట్టమొదటిసారి పూర్తి స్థాయి తెలుగు సినిమాలో మెరుస్తున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆమె ఈసారి మరో హంగామా చేయబోతోంది. గ్లామర్, డాన్స్‌తో స్క్రీన్ మీద మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్న ఆమె, “జటాధర” సినిమాలో స్పెషల్ సాంగ్ లో ధన పిశాచి (Money-minded Temptress)గా కనువిందు చేయనుంది.
“ఈ విజయదశమి… కొత్త చెడు రూపానికి సిద్ధం అవ్వండి. అక్టోబర్ 1న ధన పిశాచి రాబోతోంది!” అంటూ మేకర్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సుధీర్ బాబు (Sudheer babu) నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా, సోనాక్షి హీరోయిన్‌గా కనిపించనుంది. డెవోషనల్ టచ్‌తో స్పిరిచువల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది.
ఈ మూవీ నుంచి సోల్ ఆఫ్ జటాధర ట్రాక్ ప్రోమోను విడుదల చేయగా.. ఓం నమ : శివాయ్ అంటూ సాగుతున్న ప్రోమో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లలో ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తోంది.
‘దబాంగ్’తో బీ-టౌన్‌లో బ్లాక్‌బస్టర్లు కొట్టిన సోనాక్షి, సౌత్‌లో రజనీకాంత్‌తో చేసిన “లింగా” తర్వాత, ఇప్పుడు మొదటి తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.
సోనాక్షి సిన్హా ధన పిశాచి అవతారంలో ఎంత షాక్ ఇస్తుందో చూడాలంటే… అక్టోబర్ 1 వరకూ వెయిట్ చేయాల్సిందే!
