
వరుస ఫ్లాప్స్ తర్వాత శ్రీలీలకు అదృష్టం మళ్లీ మొదలైంది, మరో క్రేజీ సినిమా ఫిక్స్!
టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందిన శ్రీలీల గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌తో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. జూనియర్, రాబిన్‌హుడ్, మాస్ జాతర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారడంతో, ఆమె కెరీర్ “స్ట్రగుల్ జోన్” లోకి వెళ్లిపోయిందని ఫిల్మ్ సర్కిల్స్ మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ దశ తిరగబోతుందేమో!
తాజాగా శ్రీలీల చేతిలో వరుసగా కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్ సరసన సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పరాశక్తి’ లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి 2026లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పుడు హాట్ టాక్ ఏమిటంటే —
శివకార్తికేయన్‌తో మరోసారి శ్రీలీల జోడీ కాబోతుంది!
‘డాన్’ ఫేమ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ న్యూ ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మిక మందన్నను సంప్రదించగా, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా శ్రీలీలను అప్రోచ్ చేశారు. చివరకు శ్రీలీలే ఈ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది.
షూటింగ్ డిసెంబర్ 10న మొదలుకానుంది.
ఇది శ్రీలీలకు “సెకండ్ లైఫ్ ఇన్ సౌత్ సినీ ఇండస్ట్రీ” కావచ్చని సినీ వర్గాల అంచనా.
