మహేష్ బాబు ఒడిశా అడవులకు బయిలుదేరారు. అక్కడకు ఎందుకు బయిలుదేరాలో మనందరికీ తెలుసు. ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా కోసం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా షెడ్యూల్ కోసం ఓడిశాలోని దేవ్‌ మాలి, తోలో మాలి, కోలాబ్, పుట్ సీల్ ప్రాంతాలలో జక్కన్న టీమ్ షూటింగ్ లొకేషన్స్ షూటింగ్ స్పాట్స్ సెలెక్ట్ చేశాడు. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

దీంతో బుధవారం మహేష్ ఒడిశాకు బయల్దేరాడు. ఇందులోభాగంగా మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఒడిశాకి వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ కెమెరాకి చిక్కాడు. ఈ సమయంలో మహేష్ తో పాటూ ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సెండాఫ్ ఇచ్చింది.

అయితే ఒడిశాలోని కోలాబ్, పుట్ సీల్ ప్రాంతాలలో 4 రోజుల పాటూ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో మహేష్ తో మరో స్టార్ నటుడు మలయాళ స్టార్ హీరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from