సందీప్ కిషన్ ఇప్పుడు సోషల్ మీడియా జనాలకు టార్గెట్ అయ్యారు. అందుకు కారణం ఆయన తన పేరు ముందు ఓ బిరుదు తగిలించుకోవటమే. అయితే సినీ పరిశ్రమలో బిరుదులు అనేవి పీఆర్వోలు లేదా మీడియా వారు ఇచ్చేస్తూంటారు. పాపులర్ చేసేస్తూంటారు. అయితే సందీప్ కిషన్ కు ఓ బిరుదు తగిలించేసరికి జనాలు తిట్టడం మొదలెట్టారు. అందుకు కారణం ఆ బిరుదే పీపుల్స్ స్టార్ (People’s Star) .
సాధారణంగా పీపుల్స్ స్టార్ అనే పదం వినగానే ఎవరికైనా విప్లవ చిత్రాల రూపకర్త, నటుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) గుర్తొస్తారు. స్నేహ చిత్ర పతాకంపై మూడు దశాబ్దాలకు పైగా 30కి మించి చిత్రాలను ఆయన రూపొందించారు.
కానీ చిత్రంగా ఇప్పుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) పేరు ముందు ‘పీపుల్స్ స్టార్’ అనే పదాన్ని తగిలించారు. ప్రస్తుతం సందీప్ కిషన్ ‘మజాకా’ (Mazaka) మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ ను పీపుల్స్ స్టార్ గా పేర్కొని వివాదానికి తెర తీసారు.
సందీప్ కిషన్ కు పీపుల్స్ స్టార్ అనే బిరుదును ఇచ్చేశాడు. ఆర్. నారాయణమూర్తికి ఉన్న ‘పీపుల్స్ స్టార్’ అనే బిరుదును.. ఆయన ఫీల్డ్ లో ఉండగానే సందీప్ కిషన్ కు పెట్టేయడం, దాని పట్ల సందీప్ కిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.