సాధారణంగా స్టార్ హీరోలు డైరక్టర్స్ కు, నిర్మాతలకు కండీషన్స్ పెడుతూంటారు. కానీ రివర్స్ లో ప్రభాస్ కు డైరక్టర్ కండీషన్ పెట్టారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కండీషన్ ?
ఆ దర్శకుడు మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగా. ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’సినిమ చేయబోతున్నారు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూంటారు. దాంతో కాన్సర్టేషన్ ఉండదని, పూర్తిగా పాత్రలోకి వెళ్లలేరని, అలాగే గెటప్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కండీషన్ పెట్టాడని తెలుస్తోంది.
ఆ కండీషన్ ఏమిటంటే.. ‘స్పిరిట్’ చేస్తున్నప్పుడు మరో సినిమా చేయకూడదని, ఫుల్ టైమ్ స్పిరిట్ కే కేటాయించాలని ప్రభాస్‌కు చెప్పాడట. స్పిరిట్ లుక్ వేరేలా ఉంటుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
స్పిరిట్ కోసం బాడీ కూడా బిల్డ్ చేయాలి. తన లుక్ బయటకు వెళ్లకూడదని ప్రభాస్ భావిస్తున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది. ఒకసారి షూటింగ్ మొదలెడితే, ఏక ధాటిగా పని చేసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని, అప్పటి వరకూ ‘స్పిరిట్’ మూడ్‌లోనే ఉండాలని ప్రభాస్‌కు చెప్పాడట దర్శకుడు.