నవ్వించటం, కామెడీ సినిమా చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే నవ్వేందుకు ఒక్కొక్కరికి ఒక్కో స్దాయి ఉంటుంది. ఆ స్దాయిలో ఫన్ కనెక్ట్ అయితేనే సినిమాకు కనెక్ట్ అవుతారు. లేకపోతే లైట్ అని ప్రక్కకు వెళ్లి పోతారు. జబర్దస్త్ వచ్చిన తర్వాత కామెడీ నెక్ట్స్ లెవిల్ లో లేకపోతే ఆ సినిమాని పట్టించుకోవటం లేదు. ఈ సినిమా కు రిలీజ్ కు ముందు ఓ రేంజిలో ప్రమోషన్స్ చేసారు. సందీప్ కిషన్ ఏ సినిమాకు ఈ స్దాయిలో ప్రమోషన్స్ జరగలేదు. అంతేకాదు ఈ కథ గతంలో చిరంజీవి ఓకే చేసి చివర్లో తప్పుకున్నారని మేకర్స్ స్వయంగా చెప్పారు. దాంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అలాగే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ లో ఓ ఫన్, ఫీల్ గుడ్ డ్రామా కనిపించింది. మరి ట్రైలర్ లో కనిపించిన ఆ కామెడీ సినిమాలో ఉందా? ఇంతకీ ‘మజాకా’ కథ ఏమిటి? చిరంజీవికు ఎందుకు వద్దనుకున్నారు. అలాగే ఈ కథ నచ్చి చాలా కాలం డిస్కషన్స్ విషయం ఏముంది

స్టోరీ లైన్

ఇది తండ్రి కొడుకులైన రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్)లు చుట్టూ తిరిగే కథ. కృష్ణ చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో అన్ని తానే పెంచుతాడు రమణ. కృష్ణకు ఓ వయస్సు వచ్చాక పెళ్లి చేద్దామంటే , ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లను ఇవ్వటానికి ముందుకు రారు. దాంతో రమణ తాను పెళ్లి చేసుకుని తన కొడుక్కు పెళ్లి చేద్దామనుకుంటాడు. అప్పుడు రమణ కు య‌శోద (అన్షు) కనపడటం అమాంతం ఆమెతో ప్రేమలో పడిపోవటం జరుగుతుంది. దాంతో ఆమె కూడా ప్రేమించేలా చేయటానికి లేటు వయస్సులో రమణ రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు.

ఇక కృష్ణ తండ్రే ఇలా ప్రేమలో పడి తిరుగుతూంటే తాను మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటాడు. కృష్ణ కూడా తన కాలేజీలోనే చదివే మీరా (రీతూ) ప్రేమలో పడతాడు. దాంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ ప్రేమలను ఒకరికి తెలియకుండా మరొకరు కొంతకాలం మేనేజ్ చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఒకరోజున ఇద్దరికి తమ ప్రేమల విషయం తెలిసిపోయి…ముందుకు వెళ్దామనుకునేసరికి ఓ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి, దాని వలన వారి ప్రేమలో ఎలాంటి కొత్త సమస్యలు వచ్చాయి. అలాగే వీరి కథలోకి పగే ప్రాణంగా బ్రతుకుతున్న భార్గవ్ వర్మ (మురళీ శర్మ) ఎలా ఎంటరయ్యాడు. అసలు భార్గవర్ వర్మ ఎవరు…చివరకు ఈ ప్రేమ కథలు ఎలా సుఖాంతం అఅయ్యాయి అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

ఎలా ఉంది

ఇది పక్కా ఫార్ములాగా రాసుకున్న స్క్రీన్ ప్లే. కథ పాతదే అనిపిస్తుంది. అలాగే కథనం అలాగే అనిపిస్తుంది. చాలా సీన్స్ డైరక్టర్ కు ఎలా కావాలంటే అలా కన్వీనియెంట్ గా వచ్చి వెళ్లిపోతూంటాయి. మధ్య మధ్యలో నవ్విస్తూంటాయి. గ్యాప్ లలో పాటలు వస్తూంటాయి. అంతా కామెడీ అయ్యిపోతుంది అనుకుంటే అక్కడో ఓ ఎమోషనల్ సీన్ వచ్చేస్తుంది. మరీ ఎమోషన్ ఎక్కువైపోయింది. కామెడీ సీన్ వచ్చి చాలా సేపైంది.. ఓ కామెడీ బిట్ పడాలి.. అది వచ్చేస్తుంది. ఇలా కథను ప్రక్కన పెట్టి తమకు కావాల్సినట్లు రాశారు.

ఎంత పాత కథ అయినా స్క్రీన్ ప్లేలో కాస్తైనా మ్యాజిక్ ఉంటే కొట్టుకుపోతుంది. అయితే ఇక్కడ అలాంటి మ్యాజిక్ ఏమీ జరగదు. అన్ని కామెడీ సీన్స్ కు నవ్వురాదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాయమైపోయింది. ఈ కథకా ఇంత ప్రమోట్ చేసారు. ఈ సినిమాను చిరంజీవితో చేయాలి అనుకున్నారు అని చెప్పుకొచ్చారు అనిపిస్తుంది. చిరంజీవి ఈ కథ చెయ్యకపోవటం చాలా మంచి పనైంది అనిపిస్తుంది. ఏదైమైనా త్రినాధరావు, ప్రసన్న మ్యాజిక్ ..ధమాకా స్దాయిలో వర్కవుట్ కాలేదు.

నటీనటుల విషయానికి వస్తే..

రావు రమేష్ తో చేయించిన కొన్ని సీన్స్ కు బాగానే నవ్వు వస్తుంది. అయితే అంత మంచి ఆర్టిస్ట్ తో.. ఈ కామెడీ ఏంటి అనుకూడా అనిపిస్తుంది. అయితే ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక సందీప్ కిషన్ స్క్రీన్ మీద ఎనర్జిటిక్ గా కనిపించారు. ఆయన వైపు నుంచి ఏ సమస్యా లేదు. రీతు వర్మ, మన్మధుడు ఫేమ్ అన్షుకు చెప్పుకోదగ్గ పాత్రలేం కాదు. కథకు కావాల్సినట్లు వచ్చి వెళ్లిపోతారంతే. లియోన్ జేమ్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే . ఎడిటింగ్ ఫాస్ట్ గా నడిచినా, సెకండాఫ్ లో చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు అనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగా కుదరింది.

చూడచ్చా

త్రినాధరావు, ప్రసన్న కాంబినేషన్ చూసి రవితేజ ధమాకా స్దాయిలో ఎక్సపెక్ట్ చేస్తే అది మీ తప్పు. వాళ్ల వంతు కామెడీ వాళ్లు చేసారు. మీవంతు మీరు చూసి రండి.

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు, మురళీశర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు;
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాయికృష్ణ;
సంగీతం: లియోన్ జేమ్స్;
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ;
నిర్మాణం: రాజేశ్ దండ‌;
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన;
విడుదల: 26-02-2025

, , ,
You may also like
Latest Posts from