బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

స్టడీగా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఓ కాంట్రవర్సీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఓ సన్నివేశం పట్ల క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ నటుడు రణదీప్ హుడా ఓ సన్నివేశంలో చర్చిలో యేసు శిలువ ముందు తాను కూడా ఆ తరహాలోనే పోజ్ పెట్టి నిలబడి కనిపించడం జరిగింది.

అలాగే ప్రార్ధనలు జరిగిన చోటే హింసాత్మక సంఘటనలు లాంటివి చర్చి తాలూకా పవిత్రతను దెబ్బ తీశాయి అని దీనితో తమ మనోభావాలు దెబ్బ తిన్నట్టుగా నార్త్ లో పలువురు క్రైస్తవ సంఘాలు జాట్ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని అంటున్నారు. అలాగే సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గరికి వెళ్లి కూడా ప్రదర్శనలు ఆపుతామని కూడా అంటున్నారు.

అంతేకాకుండా శ్రీలంకలో (Sri Lanka) తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ చిత్రంలో చూపించారంటూ కొందరు తమిళియన్స్‌ విరుచుకుపడుతున్నారు.

తమ కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఇలా చూపించడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ తమ ఎక్స్‌ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో దర్శకుడు గోపీచంద్‌ మలినేని అడుగుపెడితే తగిన బుద్ధి చెబుతాం అంటూ భగ్గుమంటున్నారు.

, , ,
You may also like
Latest Posts from