‘హనుమాన్’ విజయంతో సూపర్‌హీరో జానర్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’ తో మరో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా తేజ పూర్తిగా సూపర్‌హీరో గానే మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది సహజంగానే వచ్చిన క్రేజ్ అయినా, లేక ప్రణాళికాబద్ధంగా నడిపిన పీఆర్ స్ట్రాటజీ అయినా — తేజ ప్రస్తుతం ఈ జానర్‌కు బ్రాండ్‌గా మారుతున్నాడు.
యంగ్ హీరో తేజ సజ్జ ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’ మూవీలో పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనుండగా… మంచు మనోజ్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించగా… కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.
సినిమా పై బజ్ భారీగా ఉండటంతో, ‘మిరాయి’ బృందం మొత్తం థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వ్యాపారంలో కనీసం రూ.100 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి రూపొందిస్తున్న రెండో చిత్రం ఇది. మొదట చిత్రం రవితేజ తో చేస్తే వర్కవుట్ కాలేదు.
ఓటీటీ మార్కెట్ నుంచే దాదాపు రూ.50 కోట్ల ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ కూడా ముఖ్యంగా తెలుగు, హిందీ మార్కెట్లలో బలంగా ఉండే అవకాశం ఉన్నందున, విడుదలకు ముందే మరో రూ.50 కోట్ల బిజినెస్ సాధిస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.
తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తుండగా… శ్రియ, జగపతిబాబు, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సిల్వర్ స్క్రీన్‌పై చూడని ఓ డిఫరెంట్ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారు మేకర్స్. అశోకుడు కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలు… వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తోన్న 9 మంది యోధులు బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
‘మిరాయి’ సెప్టెంబర్ 5, 2025న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. Already, ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి — విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.