‘మిరాయి’తో బాక్సాఫీస్‌ను వణికించిన తేజా సజ్జా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, ఇటీవల కాలంలోనే టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్ సాధించింది.

‘హనుమాన్’ తర్వాత వేగంగా ప్రాజెక్టులు చేయకుండా, కూల్‌గా ప్లాన్ చేస్తున్న తేజా… ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’పై దృష్టి పెట్టాడు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయి ఉండగానే, అసలు డ్రామా మొదలైంది.

ఒక యంగ్ ప్రొడ్యూసర్‌తో చర్చలు జరిగాయి కానీ… తేజా సజ్జా నేరుగా 12 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని వినికిడి. ఈ షాకింగ్ ఫిగర్ విన్న నిర్మాత ఒక్కసారిగా వెనక్కి తగ్గాడని ఇండస్ట్రీలో టాక్. “ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలా?” అని షాక్‌లోనే ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడట.

ఇక్కడే మరో ట్విస్ట్. ‘మిరాయి’ వెనక నిలిచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’కి ముందుకు వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలై, వచ్చే ఏడాదిలో థియేటర్స్‌కి రాబోతోందని సమాచారం.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ తనదైన డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో దూసుకెళ్తుంటారు. ఆయన హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి, ‘హను-మాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా 2021లో వచ్చిన జాంబీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో తెరకెక్కించిన ఫస్ట్ జాంబీస్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇప్పటికే దీనికి సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

తేజ సజ్జ హీరోగా ‘జాంబీ రెడ్డి 2’ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆగస్ట్ లో సోషల్ మీడియా వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఓ వీడియో గేమ్ కంట్రోలర్‌ను పట్టుకున్న చేతిని చూపిస్తూనే… ‘రాయలసీమ నుంచి ప్రపంచం అంతం వరకూ…’ అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించనుండగా… ‘గతంలో కంటే బలంగా… ఎప్పుడూ లేనంత క్రూరంగా…’ అంటూ క్యాప్షన్ ఇస్తూనే భారీ హైప్ క్రియేట్ చేసింది. 2027లో ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

, , , ,
You may also like
Latest Posts from