మన రెగ్యులర్ గా యూట్యూబ్ లో రకరకాల న్యూస్ లు, ఇంటర్వూలు తప్పుడు థంబ్ నెయిల్స్ తో చూస్తూంటాం. వాటివల్ల చాలా ఇబ్బందులు వస్తూంటాయి. అయితే వాటి జోలికి ఇన్నాళ్లూ ఎవరూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ తన దృష్టిని పెట్టింది.
రీసెంట్ గా టాలీవుడ్ నటి భార్గవి భర్తపై కూడా ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పుడు థంబ్‌నెయిల్ పెట్టి ప్రేక్షకులను మీస్‌లీడ్ చేశారు. దీంతో ఈ విషయంపై భార్గవి ఆగ్రహాం వ్యక్తం చేయడంతో పాటు ఐడ్రీమ్ నుంచి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి డిమాండ్ చేసింది.
ఈ నేపధ్యంలో సెలబ్రిటీలపై తప్పుడు థంబ్‌నెయిల్స్ మితిమీరుతుండడంతో ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఇదే విషయంపై సినీ పరిశ్రమలోని ఫిల్మ్, ఫొటో, క్రిటిక్, డిజిటల్ అసోసియేషన్‌లతో నేడు సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో తప్పుడు థంబ్‌నెయిల్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్‌ను అరికట్టడంతో పాటు ఇటీవల జరిగిన పరిణామలపై చర్చించినట్లు తెలుస్తుంది. సినీ ప్రముఖులపై ఇంటర్వ్యూల పేరుతో అసభ్యకరమైన ప్రశ్నలు.. అనుచిత వ్యాఖ్యలతో కూడిన థంబ్‌నైల్స్ సృష్టించే వారిపట్ల ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇకనుంచి తప్పుదోవ పట్టేలా థంబ్‌నెయిల్స్ పెడితే చర్యలు ఏప్రిల్ 01 నుంచి సీరియస్ గా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.