ఉగాది వీకెండ్ లో మంచి ఎక్సపెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన నితిన్(Nithiin) లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie). ఈ సినిమా, మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండి వీకెండ్ కలెక్షన్స్ వరకు ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక చతికిలపడుతోంది.
మొదటి మూడు రోజులు ఆశాజనకంగా ఉన్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే వారం రోజులు ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సోమవారం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.
ఈ వారం సినిమా బాగా ఆడాలి; లేకపోతే, అది సేఫ్ జోన్‌లో ఉండటం కష్టం. ఓవరాల్ గా సినిమా 4వ రోజున రంజాన్ పండగ అడ్వాంటేజ్ వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయిన సినిమా 64 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని చేతులు ఎత్తేసింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయింది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.