బన్నీ నెక్ట్స్ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాత నాగ వంశీ తరచుగా ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు. రీసెంట్గా, MAD స్క్వేర్‌కి సంబంధించిన ప్రెస్ మీట్లో, నాగ వంశీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సాయి సౌజన్యతో కలిసి అల్లు అర్జున్ చిత్రాన్ని నిర్మిస్తున్న నాగ వంశీ, షూటింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుందని ధృవీకరించారు. భారతీయ పురాణాల తీసుకున్న పాత్ర చుట్టూ ఈ చిత్రం ఉంటుందని, అల్లు అర్జున్ ఈ పాత్రను పోషించే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కుమారస్వామిగా అల్లు అర్జున్ నటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారిక బృందం ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత నాగవంశీ ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుందో చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి సంబంధించి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నాగ వంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది 2026 లేదా తరువాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పౌరాణిక ఇతిహాసం గురించి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి.
ఇంతకు ముందు “జులాయి”, “సన్నాఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బన్నీ-త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరచింది. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో ఎక్కడా తగ్గని ఆసక్తి మరియు అంచనాలు ఉన్నాయి.