టాలీవుడ్ చరిత్రలో ‘శివ’ అంటే సినిమా కాదు… సిస్టమ్ షాక్. అక్కినేని నాగార్జున & రామ్ గోపాల్ వర్మ కలిసి చేసిన ఈ కల్ట్ క్లాసిక్ అప్పట్లో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది.
“సినిమా అంటే ఎలా తీస్తారు?”
“హీరో అంటే ఎలా ఉంటాడు?”
“బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటో?”
అన్న డెఫినిషన్‌ని శివ పూర్తిగా రీడిఫైన్ చేసింది.

అప్పటి వరకు ఒరిజినల్ రియాలిజం, రా ఎనర్జీ, పవర్‌ఫుల్ క్యామరా వర్క్ — ఇవన్నీ కేవలం హాలీవుడ్ సినిమాలకే పరిమితమని అనుకునే టాలీవుడ్‌కు శివ స్టైల్ పంచ్ ఇచ్చింది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో మాట ఒకటే — “శివకు ముందు… శివ తర్వాత!”

ఫ్యాన్స్ డిమాండ్‌కు ఫైనల్‌గా ఫుల్‌ఫిల్

ఏళ్ల తరబడి అభిమానులు కోరిన ఆ క్షణం వచ్చేసింది. 1989లో విడుదలైన శివ, ఇప్పుడు అల్ట్రా రిచ్ 4K + అట్మాస్ ఫార్మాట్‌లో తిరిగి థియేటర్లకు.
నవంబర్ 14 — కేలండర్‌లో బ్లాక్ చేసేయండి.

నాగ్-ఆర్జీవీ ఇద్దరూ చాలా కాలంగా ఈ రీరిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కాలం, పరిస్థితులు కలిసి రాలేదు.
ఇక ఇక వేచి చూడాల్సిందేనేమో అనుకుంటున్న సమయంలో… బామ్! రీమాస్టరింగ్ పూర్తి, డేట్ కన్ఫమ్.

రీరిలీజ్ ట్రైలర్ — అంచనాలకు మించి!

సాధారణ ట్రైలర్ కాదు. ముందుగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్, “శివ ఎలా మార్పు తీసుకువచ్చింది?” అన్న వారి మాటలు…
తో సినిమా ఖచ్చితంగా చూడాలనే మూడ్ క్రియేట్ అయ్యింది.

“ఈసారి లెవల్ వేరే” — మేకర్స్ మాట

4K విజువల్స్, అట్మాస్ సౌండ్‌తో ఒరిజినల్ శివ ఎనర్జీ + న్యూ ఏజ్ థియేట్రికల్ హై…అదే ప్యాకేజీ.
సినిమాలో విసిల్ మూమెంట్, ఫైట్, BGM… అన్నీ మళ్లీ థియేటర్లో రోమాలు నిక్కబొడుచుకునేలా!
GenZ కి ఐకానిక్ వర్క్, నాగ్ ఫ్యాన్స్ కి నాస్టాల్జియా ఫ్లడ్!

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com