ప్రముఖ సినీ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ (AS Ravikumar) చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమ్యారు రవి కుమార్.

ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా ‘తిరగబడరా సామి’.

ఆయన మరణవార్తతో సహచర దర్శకులు, నటీనటులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సంతాపం తెలుపుతున్నారు. రవికుమార్‌ మృతికి తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.

#Ravi Kumar Chowdary

By admin