“ఈథన్ హంట్” మళ్ళీ వస్తున్నాడు… మరింత డేంజర్, మరింత యాక్షన్‌తో!. స్పై థ్రిల్లర్ జానరాలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీ తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. టామ్ క్రూజ్ ‘Mission: Impossible –8’ , భారతీయ మార్కెట్లో విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది.
టికెట్‌లకు భారీ డిమాండ్!
2025 మే 17న విడుదల కానున్న ఈ చిత్రం భారతంలో ఇప్పటికే టికెట్ సేల్స్ పరంగా ట్రెండ్ సెట్ చేస్తోంది.
PVR, Inox, Cinepolis లాంటి ప్రధాన థియేటర్లలో ఫస్ట్ డే కోసం ఇప్పటికే 10,000 టికెట్లు అమ్ముడైనట్టు సమాచారం.
వీకెండ్ డిమాండ్ చూస్తే, రోజుకు 15,000 టికెట్లు సేలవుతున్నాయన్నది ట్రేడ్ టాక్.
ఇప్పటివరకు అన్ని ఛానెల్స్ కలిపి దాదాపు 1.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని అంచనా!
తొలి రోజు వసూళ్లు: రూ.17-20 కోట్లు?
ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, ఈ సినిమాకు భారతదేశంలో తొలి రోజే రూ.17 నుంచి రూ.20 కోట్లు వరకు వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ‘Mission Impossible’ సిరీస్‌లోనే ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ కావొచ్చు. గత భాగమైన Dead Reckoning Part One రూ.13 కోట్ల ఓపెనింగ్‌ను సాధించిన సంగతి తెలిసిందే.
మిషన్ సిరీస్ స్పెషల్ ఏమిటంటే…
ఇవన్నీ భారీ ప్రచారం లేకుండానే జరుగుతున్నాయంటే, ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఫ్రాంచైజీలోని సాహస విన్యాసాలు, హై-అడ్రెనలిన్ యాక్షన్ సీక్వెన్సులు, టామ్ క్రూజ్ మార్క్ స్పై డ్రామా… ఇవే ప్రేక్షకులను థియేటర్ల దిశగా లాకుతున్నాయి.
స్పై యాక్షన్ జానర్‌కు భారత్‌లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే…
‘అవతార్’, ‘అవెంజర్స్’, ‘సూపర్‌మ్యాన్’, ‘జేమ్స్ బాండ్’ లాంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలు భారత బాక్సాఫీస్‌ను ఏలేశాయి.
‘అవతార్’ మూడు విడతలుగా ₹300 కోట్ల వసూళ్లు సాధించగా,
‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ₹400 కోట్లకు పైగా రాబట్టింది.
ఈ ట్రెండ్ చూస్తే, ‘Mission Impossible: Final Reckoning’ సైతం ₹100 కోట్ల క్లబ్‌ను సునాయాసంగా చేరే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈసారి… ఫైనల్ మిషన్?
టామ్ క్రూజ్ చివరిసారి ఈథన్ హంట్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈసారి ‘మిషన్’ ఎంత ఇంపాజిబుల్‌గా ఉండబోతుందో తెలియాలంటే… మే 17 వరకూ వెయిట్ చేయాల్సిందే!