సంక్రాంతి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేయటం కోసం తెర వెనుక తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ ప్రాజెక్టు ఓ పట్టాన ఒప్పుకోవటం లేదు. చాలా కథలు వింటున్నారు. డైరక్టర్స్ ని కలుస్తున్నారు. ఏ ప్రాజెక్టు వెంకీ ఓకే చేస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆయన ఇప్పటివరకు 50కి పైగా కథలు విన్నా ఏ కథకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే టాక్ ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఓ డైరక్టర్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, వెంకటేష్ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్‌ హరీష్ శంకర్ తో ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పైన అధికారిక ప్రకటన రాకముందే, ఈ కాంబోకు సంబంధించిన చర్చలు ఫిలిం సర్కిల్స్‌లో హీట్ పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో? అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి! ఎప్పుడు మొదలెట్టినా 2026 సంక్రాంతి బరిలో దింపాలనేది ప్రాధమిక లక్ష్యం.

ఇక దర్శకుడు హరీష్ శంకర్ ఎంటర్ టైన్ మెంట్‌కు కేరాఫ్ అడ్రస్. గబ్బర్ సింగ్ అనే సినిమా ఆయనకు లాండ్ మార్క్. ఆ తరువాత గద్దలకొండ గణేష్ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. కానీ ఈ రెండింటినీ పక్కన పడేలా చేసేసింది మిస్టర్ బచ్చన్.

,
You may also like
Latest Posts from