‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్‌ గురించి ట్రేడ్ లో మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి పది రోజుల్లోనే సనిమా రూ.100 కోట్ల షేర్‌ని క్రాస్‌ చేసి దూసుకువెళ్తోంది. 13 రోజుల్లో రూ.276 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ సినిమా రాబట్టింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అఫీయల్ గా ప్రకటించారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పీడు చూస్తూ ఉంటే సినిమా లాంగ్‌ రన్‌లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటోంది ట్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.150 కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశాలు ఉంది. దీంతో దిల్‌ రాజుకి దక్కిన లాభం ఎంత? డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చే లాభం ఎంత అనే చర్చ మొదలైంది.

మీడియం రేంజ్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.50 కోట్ల షేర్‌ కలెక్షన్స్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్ల షేర్‌ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో లాభపడ్డారు. కేవలం థియేట్రికల్‌ రైట్స్ ద్వారా, కలెక్షన్స్ ద్వారా నిర్మాత దిల్‌ రాజు రూ.100 కోట్లకు పైగా లాభాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నాన్ థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా మరో రూ.50 కోట్ల వరకు దిల్‌ రాజు ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈలెక్కన సినిమాతో దిల్‌ రాజు రూ.150 కోట్ల లాభంను దక్కించుకున్నట్లు అవుతుంది.

, , , ,
You may also like
Latest Posts from