గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు.
కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంక్ జనార్దన్(77) మృతి చెందారు. అయితే ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున 2.30నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
కాగా ఇప్పటివరకు బ్యాంక్ జనార్ధన్(Bank Janardhan) దాదాపు 500 సినిమాల్లో సందడి చేశారు. తెలుగులో ‘ఖననం’(Khananam), ‘రిధం’(Ridham), ‘లాస్ట్ పెగ్’(Last Peg), ‘ఉపేంద్ర 2’(Upendra2) వంటి సినిమాలు చేశారు. 1948లో జన్మించిన ఆయన తొలుత బ్యాంకులో పనిచేసే తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. అందుకే ఆయన్ని బ్యాంక్ జనార్ధన్ అని పిలుస్తూంటారు.