టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన కారుకు ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా సేఫ్‌గా బయటపడ్డాడు.

విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చిన్నప్పుడు కొంత కాలం ఆయన సత్యసాయి ఆశ్రమంలోనే చదివిన విషయం తెలిసిందే.

నేషనల్ హైవే 44పై వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నందికొట్కూరు నుంచి పెబ్బైర్‌ వైపు గొర్రెలు తీసుకెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో విజయ్ కారుకు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొని కొంత మేరకు నష్టం జరిగింది.

క్షేమంగా బయటపడిన విజయ్ దేవరకొండ ఎటువంటి గాయాలు లేకుండా మరో కారులో హైదరాబాద్‌కి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆయన డ్రైవర్ ఆందే శ్రీకాంత్ ఉందవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇక ఇటీవ‌ల విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్‌ వార్తలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. పుట్టపర్తి దర్శనం కూడా అదే సందర్భంలోనిదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ జంట ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

, , , ,
You may also like
Latest Posts from