టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారనే వార్తలతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుండగా.. ఊహించని విధంగా విజయ్ పాత లవ్ స్టోరీ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒక ఫారెన్ అమ్మాయితో విజయ్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ రచ్చ లేపుతున్నాయి.

ఎవరీ వర్జీనీ? విజయ్ మాజీ ప్రేయసా?

లీకైన ఫోటోల్లో ఉన్న అమ్మాయి పేరు వర్జీనీ (Virginie). ఈమె బెల్జియంకు చెందిన మోడల్. విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో ‘పెళ్లి చూపులు’ సినిమాలో చిన్న పాత్రలో కూడా మెరిసింది. అప్పట్లోనే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారని టాక్. కోవిడ్ సమయంలో కూడా విజయ్ ఆమెను కలవడానికి యూరప్ వెళ్లాడని, ఆమె తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రష్మిక ఎంట్రీతోనే బ్రేకప్ అయ్యిందా?

విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించిన తర్వాతే వీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని అందరికీ తెలిసిందే. అయితే, సరిగ్గా అదే సమయంలోనే బెల్జియం బ్యూటీ వర్జీనీతో విజయ్ బ్రేకప్ చేసుకున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రష్మికతో పెళ్లికి ముహూర్తం కుదిరిన వేళ.. పాత ఫోటోలు బయటకు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక కావాలని ఎవరైనా వైరల్ చేస్తున్నారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

పెళ్లి ఏర్పాట్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

వివాదాలు ఎలా ఉన్నా, విజయ్-రష్మిక పెళ్లి పనులు మాత్రం జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఇప్పటికే అతిథులకు ఆహ్వాన పత్రికలు కూడా అందుతున్నాయని సమాచారం.

ఫ్యాన్స్ ఏమంటున్నారు?

వైరల్ అవుతున్న ఫోటోలపై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అవి ‘పెళ్లి చూపులు’ షూటింగ్ సమయంలో స్నేహంతో దిగిన ఫోటోలని, పెళ్లి టైంలో విజయ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా, “రౌడీ” పెళ్లి వేళ ఈ పాత ఫోటోల రచ్చ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

#Rashmika Mandanna, #vijay deverakonda, #vijay deverakonda leaked photos, #Vijay Deverakonda’s Romantic Photos, #vijay rashmika wedding, #Virginie

By admin