కొలీవుడ్ హీరో విశాల్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘మగుడం’ షూటింగ్‌ను దర్శకుల సంఘం, ఫెప్సీ అడ్డేసిందన్న వార్త ఇండస్ట్రీలో పెద్ద హీట్‌ క్రియేట్ చేస్తోంది.

టాక్ ఏంటంటే —
విశాల్, మధ్యలోనే దర్శకుడు రవీ అరసుని ప్రాజెక్ట్ నుంచి తప్పించేశాడట! ఈ నిర్ణయం మీద దర్శకుల సంఘం సీరియస్‌గా ఫైర్ అవుతూ, రవీ అరసు నుంచి NOC తీసుకురాకపోతే షూట్ మొదలెట్టేది లేదు అంటూ స్ట్రాంగ్ నోటీస్ ఇచ్చిందట. ఫలితం? ప్రస్తుతం సినిమా మొత్తం హాల్ట్!

ఇది ఒక్కసారే కాదు…

ముందు కూడా ‘ ‘తుప్పరివాలన్‌ 2’ విషయంలో దర్శకుడు మైస్కిన్‌తో గొడవలే ప్రాజెక్ట్ పడిపోవడానికి కారణం. ఇప్పుడు అదే స్టోరీ మళ్లీ రిపీట్ అవుతోంది అని ఫిల్మ్ నగర్ మాట.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట

“విశాల్ సినిమాలు కంటే ఆఫ్ స్క్రీన్ వార్స్ ఎక్కువ!” డైరెక్టర్లతో తరచూ క్లాష్ అవుతుండటంతో, ఫిల్మ్ సర్కిల్స్‌లో సీరియస్ డౌట్స్ మొదలయ్యాయట.

కోలీవుడ్‌లో ఒకే మాట –
“మగుడం షూట్ తిరిగి స్టార్ట్ అవుతుందా? లేక ఇంకో షాకా?”

Stay tuned…

, , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com