విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందేమో అని సందేహ పడ్డారు. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా ఫ్యామిలీలు చూసే సినిమ కాదంటూ ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సినిమా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అలాంటిదేమీలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

విశ్వక్సేన్ మాట్లాడుతూ… ‘‘ ట్రైలర్‌‌‌‌ చూసి అడల్ట్ కంటెంట్‌‌ అంటున్నారు కానీ ఇది యూత్‌‌ ఫుల్ కంటెంట్‌‌తో వస్తున్న ఎంటర్‌‌‌‌టైనర్ మా సినిమా. సీరియస్‌‌గా కథలు వినే నేను.. ఈ స్టోరీ వింటూ చాలా ఎంజాయ్ చేశా. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది. పైగా ఇలాంటి సినిమాలు రాక దాదాపు ఇరవై ఏళ్లవుతోంది. ఈ జనరేషన్ హీరోలు అమ్మాయిగా నటించడం నేను చూడలేదు. ఆ లోటుని భర్తీ చేసే కథ ఇది అని చెప్పుకొచ్చారు.

నా కెరీర్‌‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో నేను పోషించిన రెండు పాత్రల్లో లైలా క్యారెక్టర్ నాకు ఇష్టం, కష్టం కూడా. మేకప్‌‌కు రెండున్నర గంటల సమయం పట్టేది. కానీ చాలా నేచురల్ గా వచ్చింది.

చీర, హై హిల్స్‌‌తో ఫైట్స్ చేయడం మాత్రం చాలా కష్టం. దాన్ని ఓ స్టైల్‌‌లో చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రమోషన్స్‌‌లో లైలా డామినేట్ చేస్తోంది కానీ సినిమా చూశాక సోను పాత్రను కూడా ఇష్టపడతారు. ఓ మూడు సమస్యల నుంచి బయటపడటానికి లైలాగా మారతాడు సోను. అవి ఏమిటనేది థియేటర్‌‌‌‌లో చూడాలి. ఇందులో కామాక్షిది సర్​ప్రైజింగ్ రోల్.

అలాగే అభిమన్యు సింగ్ కెరీర్‌‌‌‌లోనే డిఫరెంట్ రోల్ పోషించారు. మరో సర్ప్రైజింగ్ యాక్టర్‌‌‌‌ ఉన్నారు. గుళ్లు దాదా అనే ఈ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్, రిచర్డ్ ప్రసాద్ విజువల్స్‌‌తో టెక్నికల్‌‌గా మా సినిమా బ్రిలియంట్‌‌గా ఉంటుంది.

సాహు గారు సినిమా క్రాఫ్ట్ తెలిసిన నిర్మాత. నేను లైలా పాత్ర చేయగలనని ముందుగా నమ్మింది ఆయనే. భవిష్యత్‌‌లోనూ మా జర్నీ కొనసాగుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

, ,
You may also like
Latest Posts from