ఒకప్పుడు నిఖిల్ సినిమా అంటే మినిమం బజ్ పక్కా.. కానీ ఇప్పుడు?. మొత్తం మారిపోయింది. కార్తికేయ 2 ’ – నిఖిల్ కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్, ప్యాన్-ఇండియా లెవల్ సక్సెస్. ఆ టైమ్ లో నిఖిల్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిపోయాడనిపించింది. కానీ అప్పటినుంచి హీరో కెరీర్ కొంచెం డైరెక్షన్ మిస్ అయినట్టుంది. Spy,అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.
ఇక ఇప్పుడు నిఖిల్ ఫోకస్ పూర్తిగా ప్యాన్-ఇండియా స్టార్డమ్ పైనే. అందుకే భారీ ప్రొడక్షన్ హౌస్‌లతో రెండు బిగ్ ఫిల్మ్స్ చేసేశాడు: స్వయంభు& ది ఇండియన్ హౌస్.
స్వయంభు విషయానికి వస్తే షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. రీజన్ – నాన్-థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. అందుకే మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్‌లో టైమ్ తీసుకుంటున్నారు.
వాస్తవానికి స్వయంభు మీద ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. పీరియాడిక్ సెటప్ లో చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిఖిల్ దీనికోసం కత్తిసాము, మల్లయుద్ధం లాంటివి నిజంగా నేర్చుకుని డూప్స్ లేకుండా రిస్క్ చేశాడు. కానీ ఇప్పటిదాకా విడుదల తేదీ కానీ, షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందనే కబురు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాలేదు.
రామ్ చరణ్ నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరిస్తున్న ది ఇండియా హౌస్ కూడా నిఖిల్ కు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కొన్ని వారాల క్రితం భారీ ఖర్చుతో వేసిన సెట్స్ వాటర్ ట్యాంకర్ డామేజ్ అవడం వల్ల మొత్తం కూలిపోయింది. దీంతో తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నో అప్డేట్.
ఇలా రెండు సినిమాలపై కూడా క్లారిటీ లేకపోవడంతో నిఖిల్ నెక్ట్స్ లైనప్ ఇంకా హోల్డ్‌లోనే ఉంది. అయితే, ఆసియన్ సునీల్ ప్రొడక్షన్‌తో మళ్లీ కొత్త ప్రాజెక్ట్ సెటప్ అవుతున్నట్లు టాక్.