
“గంటకు నీ రేటెంత?” మెసేజ్ లు… గిరిజా ఓక్ షాకింగ్ రివిలేషన్స్!?
సోషల్ మీడియా యుగం… ఒక్క వీడియో చాలు — నిన్న ఎవరికీ తెలియని పేరు, ఈ రోజు దేశం అంతా చర్చించే విషయం! ఇదే హీట్ ఇప్పుడు మరాఠీ బ్యూటీ గిరిజా ఓక్. ఒక ఫన్నీ ఇంటర్వ్యూ క్లిప్‌తో రాత్రికి రాత్రే ట్రెండింగ్ టాపిక్ అయిపోయిన ఆమె… ఇప్పుడు మాత్రం షాకింగ్ కారణంతో మళ్లీ వైరల్ అవుతోంది!
“రోజూ అడుగుతున్నారు… నీ రేటెంత?” – గిరిజా ఓక్ బిగ్గరగా చెప్పిన చేదు కథ!
గత కొన్ని రోజులుగా గిరిజా పేరు నెట్టింట మారుమోగుతుంది. ఫాలోవర్లు వేలల్లో కాదు — లక్షల్లో పెరిగారు. అయితే ఈ క్రేజ్ ఆమెకు సినిమాలు కాదు… తీవ్రమైన హరాస్మెంట్ తీసుకొచ్చిందట!
ఓ ఇంటర్వ్యూలో ఆమె నేరుగా చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం: “ఒక్క వీడియోతో ఫేమస్ అయ్యాను… కానీ ‘నీ రేటెంత?’, ‘ఒక గంటకు ఎంత?’ లాంటి మెసేజ్‌లు కూడా అదే రోజు నుంచి మొదలయ్యాయి!”
రోజూ పది, ఇరవై కాదు— డజన్ల కొద్ది అసభ్య సందేశాలు వస్తున్నాయని ఆమె బాధతో ఈ విషయం షేర్ చేశారు.
“బయట చూస్తే గౌరవంగా… ఆన్‌లైన్‌లో మాత్రం అసలు అదుపు లేదు!”
ఆన్‌లైన్ హరాస్మెంట్‌పై ఆమె చెప్పిన షాకింగ్ ఆబ్జర్వేషన్: “ఇలాంటి మెసేజ్‌లు పంపేవాళ్లు బయట కనిపిస్తే కంటికి కనిపించకుండా గౌరవంగా మాట్లాడుతారు. కానీ ఫోన్ చేతికి వచ్చాక… పూర్తిగా మారిపోతారు.”
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు కారణమయ్యాయి. సెలబ్రిటీలు ఎదుర్కొనే ఆన్‌లైన్ అశ్లీలత మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఎవరీ ఈ గిరిజా ఓక్? ఎందుకు ఒక్క క్లిప్‌తో ఇలా వైరల్?
మరాఠీ పరిశ్రమలో పేరున్న నటి. బాలీవుడ్‌లో తారే జమీన్ పర్‌తో ఎంట్రీ. తర్వాత షోర్ ఇన్ ద సిటీ, కాలా, జవాన్ (2023) వంటి సినిమాలు.
ఇటీవల విడుదలైన OTT మూవీ ఇన్‌స్పెక్టర్ జెండేలో కీలక పాత్ర.
అయితే ఆమెను దేశం మొత్తం గుర్తించిన ఇంటర్వ్యూ — గుల్షన్ దేవయ్యతో నటించిన రొమాంటిక్ సీన్లో జరిగిన ఫన్నీ ఘటన చెప్పిన క్లిప్.
ఆ వీడియో వైరల్…అదే వీడియోతో ట్రోలింగ్ కూడా ఆకాశాన్నంటింది. సోషల్ మీడియా ఫేమ్ – వరమా? శాపమా?
గిరిజా ఓక్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.
