ముంబైకు చెందిన నిషా పాటిల్ కు నటుడు సంజయ్ దత్ కి వీరాభిమాని. ఆమె ఇటీవల నిషా పాటిల్ కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు. తన సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి ని సంజయ్ దత్‌కు రాసేసి అందరికీ షాక్ ఇచ్చింది.

తన చివరి రోజులను ముందే గుర్తించిన నిషా పాటిల్ ఆస్తి డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసింది. ఇదంతా ఇంటికి దస్తావేజులు వచ్చాక కానీ.. సంజు బాబాకు మేటర్ అర్థం కాలేదు.

అసలు పరిచయమే లేని ఒక అపరిచితురాలు ఆస్తి రాసివ్వడం చూసి షాక్ అయ్యాడు. ట్విస్ట్ ఏమిటంటే నిషా పాటిల్ ఇప్పటిదాకా సంజయ్ దత్ ని ప్రత్యక్షంగా కలవలేదు. కానీ.. తన హీరో మీద ప్రేమతో కోట్ల రూపాయలు కానుకగా ఇచ్చింది.

అయితే సంజయ్ దత్ ఆ సొమ్ముని స్వీకరించలేదు. త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీకే అవి తిరిగి చెందేలా తన లీగల్ టీమ్ ని పురమాయించారు.

ఇంత వీరాభిమానిని కలుసుకోలేకపోవడం కలవపరిచిందని, కనీసం కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని సంజయ్ దత్ పేర్కొన్నారు.

#Sanjay Dutt

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *