

శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అచ్చ తెలుగమ్మాయి.. కానీ హిందీ సినిమమా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
అలాగే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శోభితా ధూలిపాళ… పెళ్లి తర్వాత మాత్రం తన స్టైల్ మార్చేసింది!

డిసెంబర్ 2024లో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత, తన ఆన్లైన్ ప్రెజెన్స్ ను తగ్గించిన శోభితా ధూలిపాళ, గత ఆరు వారాల్లో ఇన్‌స్టాగ్రామ్ లో కేవలం ఐదు పోస్టులే షేర్ చేసింది. ఒకప్పుడు వారం లో పలుమార్లు అప్‌డేట్స్ ఇచ్చే ఆమె ఇలా సడన్‌గా సైలెంట్ కావడం ఫ్యాన్స్ లో కుతూహలం రేపుతోంది.
అయితే ఈ మధ్య భర్తతో సరదాగా గడిపిన క్షణాలను షేర్ చేస్తూ, “హ్యూమన్ స్కిల్స్ నేర్చుకుంటున్నా” అంటూ కుకింగ్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫన్నీ అప్‌డేట్ లో నాగచైతన్యను ట్యాగ్ చేయడం ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చింది.

తాజాగా బీచ్ లో తీసుకున్న ఫోటోస్ పోస్ట్ చేసింది. నీలి కాటన్ చీర, ఎరుపు బ్లౌజ్, సిల్వర్ జుమ్కీలు, చిన్న బిండి తో సోభితా ట్రెడిషనల్‌గా అద్భుతంగా మెరిసింది.
ఇప్పుడు అందరి మదిలో ఒక్క ప్రశ్నే—శోభితా ధూలిపాళ ఇక కొత్త తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందా లేదా?
“సోషల్ మీడియాలో మౌనం.. సినిమాల్లో హంగామా?” అనేది అభిమానుల కుతూహలం!