

దసరా రేసులో ఓజీ, అఖండ-2 రెండు సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫైట్ కేవలం టాలీవుడ్ లెవెల్‌లో కాదు, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ స్టారర్ ‘అఖండ-2’ ను హిందీ బెల్టులో బలంగా లాంచ్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ వేసినట్టు సమాచారం.
హిందీ బెల్టుపై మేకర్స్ కన్ను
మొదటి భాగం ‘అఖండ’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చినప్పుడు హిందీ ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అఘోర లుక్, డివైన్ ఎలిమెంట్స్ నార్త్ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేశాయి. అదే బూస్ట్‌ను ఇప్పుడు రెండో భాగానికి యూజ్ చేసుకోవాలని టీమ్ స్ట్రాటజీ. అందుకే హిందీ డబ్బింగ్, పబ్లిసిటీ, రిలీజ్ అన్ని పెద్ద స్థాయిలో చేయాలని లైన్ వేసుకున్నారు.
టీజర్‌లోనే బిగ్ బడ్జెట్ పబ్లిసిటీ
ఇప్పటికే టీజర్ రిలీజ్ సమయంలోనే మేకర్స్ నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ప్రమోషన్లు చేశారు. బైక్ ర్యాలీలు, హోర్డింగ్స్, సోషల్ మీడియా క్యాంపైన్స్ అన్నీ బాగా ఫాలో అయ్యారు. ఇక సినిమా రిలీజ్ సమయానికి బాలయ్యను ముంబై, ఢిల్లీ, లక్నో, జైపూర్‌లకు పంపించి, అక్కడ గ్రాండ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట.
మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ – టైమ్ ప్రెషర్
అఖండ-2ను తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడే క్లారిటీ లేదు. షూటింగ్ కొంత లేట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్స్ అన్నీ టైమ్ ఫ్రేమ్‌లో కుదరుతాయా అన్న డౌట్స్ ఉన్నాయి.
దసరా రేసా? లేక వేరే డేట్?
దసరాకు ఓజీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు దూసుకుపోతుంటే, అఖండ-2 విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మేకర్స్ టార్గెట్ దసరానే అయినప్పటికీ, నార్త్ మార్కెట్‌ను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే సమయం పడుతుందని అనిపిస్తోంది. అందుకే ‘బాలయ్యను హిందీ బెల్టులో సోలో లెవెల్‌లో లాంచ్ చేయడానికి వేరే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారా?’ అనే క్వశ్చన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి, ఈసారి బాలయ్య కేవలం తెలుగు ఆడియన్స్‌కే కాకుండా, నార్త్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ భారీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు.