సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూశాం — హీరోపై చేతబడి, నజర్‌ దోషం, రహస్య శక్తులు! కానీ రియల్ లైఫ్‌లో సినిమా స్టార్‌ ఇలా మాట్లాడటం చాలా అరుదు. అదీ సుమన్ లాంటి సీనియర్ నటుడు అయితే? అవును — ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొంది, ఆ తర్వాత నటుడుగా బిజీ అయ్యిన సుమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో షాక్‌ కలిగిస్తున్నాయి.

ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్‌ తన కెరీర్‌లో జరిగిన ఆశ్చర్యకర సంఘటనను బయటపెట్టారు. “నాపై చేతబడి జరిగింది అన్నది నిజమే,” అని సుమన్‌ నిశ్శబ్దంగా కానీ గట్టిగా చెప్పారు. “ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. సినిమాల్లోనే కాదు, బిజినెస్‌లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి,” అని ఆయన వెల్లడించారు.

సుమన్‌ తన జీవితంలో జరిగిన ఈ మిస్టీరియస్‌ ఫేజ్‌ను గుర్తు చేసుకుంటూ చెప్పారు — “అప్పట్లో కొందరి సలహా మేరకు కేరళలోని ‘చోటనికరే’ అనే చోట పూజ చేయించుకున్నాను. అది నిజంగా పని చేసిందా, కాదా నాకు తెలియదు. కానీ నేను టైమ్‌ని నమ్ముతాను. జరగాల్సింది టైమ్‌ జరిపిస్తుంది. అదే కర్మ,” అని వేదాంత ధోరణిలో చెప్పారు.

అయన ఇంకా వివరించారు — “మనకు జరిగే విజయాలు, వైఫల్యాలు, రోగాలు అన్నీ మన కర్మలోనే రాసి ఉంటాయి. మనం ఎవరో కారణమని అనుకుంటాం కానీ నిజానికి టైమ్‌ వాళ్లతో అలా చేయిస్తుంది. వాళ్ల ఉద్దేశం కాదు — అది కూడా వాళ్ల రాతే.”

గతంలో సుమన్‌ అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని ఆరు నెలలు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆ సంఘటనతో ఆయన కెరీర్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆయన చేసిన “చేతబడి జరిగింది” అన్న వ్యాఖ్య సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

సాధారణంగా ఇలాంటి విషయాలు సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి — కానీ నిజ జీవితంలో ఒక స్టార్ హీరో చేతబడి తనపై జరిగిందని బహిరంగంగా చెప్పటం సినీ వర్గాల్లో కుతూహలాన్ని, అభిమానుల్లో షాక్‌ని రేకెత్తిస్తోంది.

, , , ,
You may also like
Latest Posts from