ప్రస్తుతం ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆమె గురించిన కబుర్లే. మంచో చెడో , సినిమాల గురించో, లవ్ గురించో ఏదో ఒకటి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. మధ్యమథ్యలో ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు. అవన్నీ లైట్ తీసుకుంటూంటుంది ఆమె.

మధ్యమథ్యలో ఇవన్నీ చాలదన్నట్లు ఈమె పెళ్లి గురించి వార్తలు . ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ గురించి ఓ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది. రష్మికకు ఇప్పుడు పది కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చిందిట.

కన్నడ బ్యూటీ రష్మిక.. ‘ఛలో’ మూవీతో తెలుగులోకి ఎం‍ట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

ఈ క్రమంలో ర‌ష్మిక ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్‌ గా మారిపోయింది. బాలీవుడ్ స్థాయిలో ఆమె పేరు మార్మోగిపోతోంది. పుష్ప‌, యానిమ‌ల్, పుష్ప 2 సినిమాల‌తో బాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకొంది. ఇటీవ‌ల విడుద‌ల ‘చావా’తో మ‌రో సూప‌ర్ హిట్ ద‌క్కించుకొంది.

త్వ‌ర‌లో స‌ల్మాన్ ఖాన్ – మురుగ‌దాస్ కాంబోలో రాబోతున్న సికింద‌ర్‌లో క ఊడా త‌నే హీరోయిన్. ఇది కూడా క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకొంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. అందుకే ర‌ష్మిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవ‌డానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు ముందుకొస్తున్నాయి.

బాలీవుడ్‌కు చెందిన ఓ బ‌డా నిర్మాణ సంస్థ ర‌ష్మిక‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింద‌ని స‌మాచారం. దాదాపు రూ.100 కోట్ల‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార్ట‌. క‌థా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ‌ని, ఓ క్రేజీ డైరెక్ట‌ర్ ఈ ప్రాజెక్ట్‌ని టేక‌ప్ చేస్తార‌ని తెలుస్తోంది.

ఈ సినిమా నిమిత్తం రష్మికకు పది కోట్లు దాకా ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. మామూలుగా హీరోయిన్ గా రష్మిక ఒక్కో చిత్రానికి రూ.4 నుంచి రూ.5 కోట్ల పారితోషికం అందుకొంటోంది. సినిమా అంతా త‌న‌పైనే న‌డుస్తుంది కాబ‌ట్టి, బ‌ల్క్ డేట్లు అవ‌స‌రం కాబ‌ట్టి, త‌న పారితోషికం రూ.10 కోట్ల‌కు పెంచే ఇవ్వటానికి ముందుకు వచ్చారని బాలీవుడ్ టాక్.

, ,
You may also like
Latest Posts from