బాలీవుడ్‌ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా లండన్‌లో ఓ అనూహ్య సంఘటనను ఎదుర్కొన్నారు. వింబుల్డన్ 2025 మహిళల ఫైనల్ మ్యాచ్‌కి హాజరై, అక్కడి నుంచి భారత్‌కి తిరుగు ప్రయాణమవుతుండగా… ఆమె సూట్‌కేస్‌ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో మాయం అయింది! ఆ లగ్జరీ బ్యాగ్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన నగలు ఉన్నాయని ఊర్వశి తానే స్వయంగా వెల్లడించారు.

ఈ ఘటనపై గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించిన ఊర్వశి – “నా విలువైన వస్తువులు పోయాయి, కానీ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిలో ఎవరూ సాయపడలేద‌”ంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌ యాజమాన్యం నుంచి ఇప్పటికీ స్పందన రాలేదని తెలిపారు.

ఇదే మొదటిసారి కాదు. 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో రూ. 45 లక్షల విలువైన వస్తువులు మాయం కాగా, గతంలో తన ఐఫోన్‌ కూడా చోరీకి గురైన ఘటన ఆమెకు ఎదురైంది. వరుసగా విలువైన వస్తువులు పోవడం ఊర్వశిని కలవరపెట్టడంలో ఆశ్చర్యం లేదు!

, , ,
You may also like
Latest Posts from