సినిమా వార్తలు

‘స్పిరిట్’ డిజిటల్ మార్కెట్‌లో బ్లాస్ట్! ఎంతకు అమ్ముడైందో తెలిస్తే మతి పోతుంది

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా మొదలైతే హోలీ, దీపావళి మాదిరి పండగే. కానీ ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్ అంటే? అది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌కి కూడా ఓవర్‌క్లోక్ చేసిన పండగే! ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నారు—

“అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత… ఇప్పుడు వంగా డైరెక్షన్‌లో ప్ర‌భాస్‌ తో చేసే స్పిరిట్ మామూలుగా ఉండదు”. మాస్, ఇంటెన్స్, రా ఎమోషన్—ఈ మూడు కలిపితే పేలేదే స్పిరిట్. అదే ఇప్పుడు బిజినెస్ విషయంలోనూ కనపడుతోంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలంటే… ఈ ఒక డీల్ చాలు!

షూటింగ్ మొదలైన మొదటి వారం కూడా ముగియకముందే—

ఓటిటీ సంస్ధల మధ్య పోటీ బీభత్సంగా మారింది . చివరకు ఒక పెద్ద OTT అఖండ డీల్ కొట్టేసింది. అన్ని భాషల డిజిటల్ రైట్స్ కలిపి… ₹160 కోట్లు! —దాదాపు చాలా తెలుగు స్టార్ సినిమాల మొత్తం బడ్జెట్‌కి సమానంగా!

ఎందుకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ కు ఇంత క్రేజ్? వంగా బ్రాండ్ – రా, రెబెల్, ఇంటెన్స్ కంటెంట్! అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్—
ఈ మూడు చెప్పగానే OTTల‌కు ఒకే విషయం క్లియర్… “వంగా సినిమా = బ్లాస్టింగ్ వాచ్-అవుట్ వ్యాల్యూ!”

ఈ సినిమాలు ఓటీటీలో చేసిన స్ట్రీమింగ్ రికార్డులు చూస్తే… స్పిరిట్‌కి పెట్టుబడి పెట్టడం రిస్క్ కాదు—రేసులో గెలుపే!

Similar Posts