సినిమా వార్తలు

‘వారణాసి’ 400 FPS సీక్రెట్ బయటకు! రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిపై సోషల్ మీడియాలో హైప్ ఓ రేంజిలో ఉంది. టైటిల్ ఫుటేజ్ రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకూ… ఒక్కో ఫ్రేమ్‌ని జూమ్ చేసి చూసి, థియరీలు చేస్తూ, రియాక్షన్ వీడియోలతో నెటిజన్స్ బిజి అయ్యిపోయారు. రాజమౌళి స్టైల్‌లోని స్కేల్, వరల్డ్ బిల్డింగ్, విజువల్ ఎమోషన్—మొత్తం ప్యాకేజీకి దేశవ్యాప్తంగా అపారమైన స్పందన వస్తోంది.

400 FPS షాకర్—సీనిమా కాదు, టెక్నికల్ ఎరా మారిందన్నట్టే!

ఇక తాజాగా సినిమా VFX సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ చెప్పిన టెక్నికల్ డిటైల్ సోషల్ మీడియాను మరింత వేడెక్కించింది. టైటిల్ ఫుటేజ్ మొత్తం 400 ఫ్రేమ్స్-పర్-సెకండ్‌లో షూట్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అంటే సాధారణంగా సినిమా 24 fpsలో షూట్ అవుతుందనే విషయం తెలిసిందే. కానీ 400 fps అంటే—భారతీయ సినిమాకే కొత్త లెవెల్.

మోహన్ వివరాల్లోకి వెళ్లితే—

“వారణాసి ప్రపంచాన్ని ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్‌లో చూపించడం ఒక కీలక క్రియేటివ్ ఐడియా. ఫ్రేమ్‌లో కనిపించే ప్రతీ ఎలిమెంట్ స్లో మోషన్‌లో కదిలినా… కెమెరా మాత్రం రియల్ టైమ్ స్పీడ్‌లో ట్రావెల్ అవుతుంది. దీంతో ప్రేక్షకులు గ్రాండియర్‌ని, మైక్రో-డిటైల్స్‌ని స్పష్టంగా ఫీల్ అవ్వగలరు.”

ఈ టెక్నిక్ సినిమాకి మైథికల్, రియల్ కలిసిన ఫీల్ ఇచ్చేలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇది రాజమౌళి తరహా పుషింగ్-ది-బౌండరీస్‌కు మరో ప్రూఫ్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

బాహుబలి… RRR… ఇప్పుడు వారణాసి — రాజమౌళి లెవెల్ మళ్లీ పెరిగింది!

బాహుబలి, RRRలతో ఇప్పటికే ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ స్కేల్ తెచ్చిన రాజమౌళి—ఇప్పుడు వారణాసితో విజువల్ స్టోరీటెల్లింగ్‌నే రీడిఫైన్ చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

“ఇది గ్లింప్స్ మాత్రమే… అసలు సినిమా వస్తే ఇండియన్ సినిమా విజువల్స్‌కి కొత్త యుగం మొదలు!”

వారణాసి ఇప్పుడే ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత అంబిషస్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోందని పరిశ్రమలో మాటలు వినిపిస్తున్నాయి.

మరిన్ని అప్‌డేట్‌లు కోసం ఫ్యాన్స్ హై అలర్ట్‌లోనే!

Similar Posts