టాలీవుడ్ బాక్సాఫీస్ కు మార్చి పెద్దగా కలిసి రాలేదు. అంచనాలకు మించి వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం కోర్ట్ మాత్రమే. అయితే ఇప్పుడు మార్చి చివరి వారంలో ఐదు సినిమాలు విడుదల కానుండగా, ప్రేక్షకులకు థియేటర్లలో వైవిధ్యమైన వినోదం లభిస్తుందని భావిస్తున్నారు.
ఆ సినిమాలు రాబిన్‌వుడ్, మ్యాడ్ స్క్వేర్, లూసిఫర్ 2: ఎంపురాన్, వీర ధీర శూర, సికందర్ ఈ వారం ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇందులో మొదటి రెండు మాత్రమే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు.
దాంతో రెండు స్ట్రైయిట్ తెలుగు సినిమాల మధ్యనే పోటి ఉండనుంది. అవి రెండు కూడా కామెడి సినిమాలే కావటం విశేషం.
నితిన్, వెంకీ కుడుముల కాంబోలో భీష్మ తరువాత చేసిన చిత్రం రాబిన్ హుడ్ సెట్ అయింది. భీష్మ కంటే రాబిన్ హుడ్ పెద్ద హిట్ అవుతుందని టీం నమ్మకంగా ఉంది. ఇందులో శ్రీలీల డ్యాన్సులు మాత్రమే కాకుండా పర్ఫామెన్స్ ఉంటుందని అంటున్నారు. అలాగే డేవిడ్ వార్నర్ స్పెషల్ అప్పియరెన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని నాగవంశీ ఫిక్స్ అయ్యి చేసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ . ఇందులోనూ కథ ఏమీ ఉండదని, సిట్యువేషనల్ కామెడీ అని క్లారిటీ ఇచ్చారు. లాజిక్స్ వెతక్కండని ముందే చెప్పేశాడు.