ఫోటోలుసినిమా వార్తలు

“మమ్మీ.. ఆ పొట్టి బట్టలేంటి?” అని అడిగిన కొడుకు.. అనసూయ ఇచ్చిన దిమ్మతిరిగే కౌంటర్ ఇదే!

ప్రముఖ నటి, మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సుల విషయంలో వచ్చే విమర్శలకు ఆమె ఇచ్చే కౌంటర్లు మామూలుగా ఉండవు. తాజాగా అనసూయ తన బట్టల విషయంలో సొంత కొడుకు చేసిన కామెంట్స్, దానికి ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

శివాజీపై అనసూయ అటాక్!

ఇటీవల టాలీవుడ్ లో హీరోయిన్ల బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై అనసూయ ఒక రేంజ్‌లో విరుచుకుపడింది.

శివాజీని టార్గెట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఊపిరాడకుండా చేసింది. అంతేకాకుండా, కొత్త సంవత్సరం వేళ బికినీ ఫోటోలను షేర్ చేసి ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

భర్త ఓకే.. కానీ కొడుకే అభ్యంతరం చెప్పాడు!

నిజానికి అనసూయ తన లైఫ్ స్టైల్ విషయంలో చాలా ఫ్రీడమ్‌గా ఉంటుంది. ఆమె భర్త సుశాంక్ కూడా ఆమె ఇష్టాలకే ప్రాధాన్యత ఇస్తారు.

అయితే, భర్త బాగానే అర్థం చేసుకున్నప్పటికీ.. కొడుకుల దగ్గరికి వచ్చేసరికి అనసూయకు కొత్త సమస్య ఎదురైందట. ఆమె వేసుకునే పొట్టి బట్టలపై తన పెద్ద కొడుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు స్వయంగా అనసూయే వెల్లడించింది.

“మమ్మీ ఆ డ్రెస్ ఏంటి?” – మొహం మీదే చెప్పేశాడు!

అనసూయ పెద్ద కొడుకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటాడట. “మమ్మీ ఇలాంటి డ్రెస్‌ ఎందుకు వేసుకుంటున్నావు? ఇది నాకు నచ్చలేదు” అని మొహం మీదే చెప్పేస్తాడట. ఓసారి అనసూయ క్రాప్ టాప్ వేసుకుంటే, “అది కింద వరకు వేసుకో మమ్మీ” అని సలహా ఇచ్చాడట. ఇలా చాలా సందర్భాల్లో కొడుకు ఆమె బట్టలపై ఓపెన్‌గా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

సొంత కొడుకుకే క్రేజీ కౌంటర్!

కొడుకు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అనసూయ మాత్రం తగ్గలేదు. అతనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిందట. “నా బట్టలు నా ఇష్టం.. నాకు కంఫర్ట్‌గా ఉన్నవే వేసుకుంటాను” అని తేల్చి చెప్పిందట.

అంతేకాదు, “నువ్వు వేసుకునే కొన్ని టీషర్టులు నాకు నచ్చవు, కానీ నేను నిన్ను వేసుకోనిస్తున్నాను కదా.. ఇది కూడా అంతే” అంటూ కొడుక్కు లాజిక్‌తో సమాధానం చెప్పిందట. ఇది నాలుగేళ్ల క్రితం ఇంటర్వ్యూలో చెప్పిన విషయమైనా, ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది.

జబర్దస్త్ వదిలేయడానికి కారణం అదేనా?

అనసూయ కెరీర్‌ను మార్చేసిన ‘జబర్దస్త్’ షో నుంచి ఆమె తప్పుకోవడానికి తన పిల్లలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. షోలో కమెడియన్లు తనపై వేసే డబుల్ మీనింగ్ డైలాగులు, పంచ్‌లను పిల్లలు చూస్తే తప్పుగా అనుకుంటారనే ఉద్దేశంతోనే ఆమె ఆ షోను వదులుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనసూయ కేవలం సినిమాలకే పరిమితమైంది. తాజాగా రేణు దేశాయ్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

Similar Posts