సినిమా వార్తలు

‘రాజా సాబ్’ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటోంది ఎవరు?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా సాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలు, తన సినిమా ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తుల గురించి మారుతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇండస్ట్రీలోనే ఉన్నారా ఆ శత్రువులు? మారుతి తన కెరీర్‌లో ఎన్నో హిట్లు ఇచ్చినా, రాజా సాబ్ విషయంలో ఆయనపై ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మరియు నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

మారుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“నేను ఈ స్థాయికి రావడం ఇష్టం లేని కొందరు, నేను ఈ సినిమాతో ఫెయిల్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. నాపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం వెనుక ఒక పద్ధతి ప్రకారం కొందరు పని చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి తనను టార్గెట్ చేస్తున్నారని, తన పతనాన్ని చూడాలని కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎదురుచూస్తున్నారని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు.

ట్రోల్స్ నన్ను లోతుగా బాధించాయి!

సోషల్ మీడియాలో ‘అమీర్‌పేట్ గ్రాఫిక్స్’ అని, ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేరని వస్తున్న కామెంట్స్ తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయని మారుతి అంగీకరించారు. “ముఖ్యంగా రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్ తర్వాత జరిగిన ట్రోలింగ్ నాపై ఉన్న ద్వేషాన్ని చూపించింది. కానీ, ప్రభాస్ గారు నాపై ఉంచిన నమ్మకం ముందు ఇవేవీ పని చేయవు. ఒక మనిషి ఎదగకూడదని కోరుకునే వారు ఎప్పుడూ ఉంటారు, కానీ నా పనితోనే వారికి సమాధానం ఇస్తాను” అని మారుతి స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ట్రోలింగ్స్‌పై మారుతి ఎమోషనల్ అయ్యారు. గతంలో ఎన్టీఆర్ కాలర్ కామెంట్స్ మీద చేసిన వ్యాఖ్యలు, బాహుబలికి ముందు ప్రభాస్‌ను మీడియం రేంజ్ హీరో అన్నట్లుగా వైరల్ అయిన మాటలు కేవలం ‘స్లిప్ ఆఫ్ టంగ్’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సినిమా పాటలపై వస్తున్న విమర్శలను కూడా గమనిస్తున్నానని, సోషల్ మీడియా ట్రోలింగ్ తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు.

నచ్చకపోతే నా ఇంటి అడ్రస్ ఇస్తా!

ఈ సినిమాపై తనకు ఎంత నమ్మకం ఉందో చెబుతూ మారుతి ఒక క్రేజీ ఛాలెంజ్ కూడా విసిరారు. “రాజా సాబ్ సినిమా చూశాక మీకు నచ్చకపోతే, నా ఇంటి అడ్రస్ ఇస్తాను, వచ్చి నన్ను అడగండి” అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను ఒక ‘మీడియం రేంజ్’ నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి రుణపడి ఉంటానని చెబుతూనే, తన కష్టాన్ని తక్కువ చేసి చూస్తున్న వారికి బాక్సాఫీస్ వద్ద సమాధానం చెబుతానని మారుతి గట్టిగా చెప్పారు.

Similar Posts