సినిమా వార్తలు

66లోనూ 30లా నాగ్! ఆ ఒక్క పని వల్లే… సీక్రెట్ లీక్ చేసిన మన్మధుడు!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గ్లామర్ అంటే అదొక అద్భుతం. 66 ఏళ్లు దాటినా ఆయన ఫిట్‌నెస్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా అసూయ కలుగుతుంది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి గారితో నాగార్జున చేసిన ఓ చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “మీకంటే నేనే వయసులో చిన్నవాడిని కానీ.. చూడటానికి మీరే చిన్నగా కనిపిస్తున్నారు” అని కీరవాణి అడిగిన ప్రశ్నకు నాగ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కడుపు నిండా తింటాను.. నెయ్యి కూడా వదలను!

సాధారణంగా ఫిట్‌గా ఉండాలంటే డైటింగ్ చేయాలి, నచ్చినవి తినకూడదు అని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ నాగార్జున మాత్రం ఇందుకు భిన్నం. “నేను నా బాడీని దేనికీ దూరం చేయను (I don’t deprive my body). మధ్యాహ్నం పూట కడుపు నిండా వైట్ రైస్, బ్రౌన్ రైస్ తింటాను. అందులో నెయ్యి వేసుకుంటాను, ఆకుకూరలు, చికెన్, ఫిష్, చివరకు పచ్చడి, పెరుగుతో కడుపు నిండా భోజనం చేస్తాను” అని నాగ్ చెప్పారు.

రాత్రిపూట ఆ ‘అలవాటు’ లేకపోతే నిద్ర పట్టదు!

నాగార్జున గ్లామర్ రహస్యంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆయన స్వీట్ లవర్ కావడమే. “నేను రాత్రిపూట కొంచెం స్వీట్ తినకుండా పడుకోలేను. స్వీట్ తింటేనే నాకు నిద్ర పడుతుంది” అని ఆయన ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. మరి స్వీట్లు తిని, నెయ్యి తిని అంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు?

నాగార్జున అసలైన ‘మ్యాజిక్’ ఫార్ములా ఇదే:

కీరవాణి గారితో నాగ్ పంచుకున్న ఆ రెండు ముఖ్యమైన సూత్రాలు ఇవే:

7 PM డెడ్ లైన్: నాగార్జున రాత్రి భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 7 గంటలకే పూర్తి చేస్తారు. ‘ఎర్లీ డిన్నర్’ అనేది ఆయన హెల్త్ కి మెయిన్ పిల్లర్.

35 ఏళ్ల తపస్సు: తిన్న క్యాలరీలను బర్న్ చేయడానికి ఉదయాన్నే కఠినమైన వర్కవుట్స్ చేస్తారు. మెటబాలిజం రేటును హైలో ఉంచుకోవడం వల్ల, కూర్చున్నప్పుడు కూడా క్యాలరీలు బర్న్ అవుతూనే ఉంటాయని, ఇది గత 35 ఏళ్లుగా తాను చేస్తున్న పని అని ఆయన వివరించారు.

సినిమా షూటింగులు, బిజీ లైఫ్ ఉన్నా కూడా దశాబ్దాలుగా ఈ క్రమశిక్షణను పాటిస్తున్నారు కాబట్టే.. ఆయన నేటికీ వెండితెర ‘మన్మధుడు’గా వెలిగిపోతున్నారు.

Similar Posts