టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అజేయుడిగా దూసుకుపోతున్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 8 హిట్లు కొట్టి, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ట్రిపుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వస్తోంది, కలెక్షన్లు సునామీలా వస్తున్నాయి.. అంతా బాగుంది అనుకునేలోపు అనిల్ రావిపూడికి ఒక విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ఏకంగా 15 కోట్ల నష్టం అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది!
నిర్మాతతో బెట్టింగ్.. రివర్స్ అయిన సీన్!
సాధారణంగా సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు కార్లు, విల్లాలు గిఫ్టుగా ఇస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
అసలు పందెం ఏంటంటే: సినిమా విడుదలకు నెల రోజుల ముందే నిర్మాత సాహు గారపాటి ఒక పందెం వేశారట. “మన సినిమా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లు దాటుతుంది చూడు” అని అనిల్‌తో అన్నారట.
అనిల్ ఛాలెంజ్: “అబ్బో.. అంత సీన్ ఉందా? ఒకవేళ అదే జరిగితే నీకు నచ్చిన కారు గిఫ్ట్ ఇస్తా” అని అనిల్ రావిపూడి ప్రామిస్ చేశారట.
కట్ చేస్తే: సినిమా ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి నిర్మాత పందెం గెలిచేలా చేసింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన జేబులోంచి నిర్మాతకు ఖరీదైన కారు కొనివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. “సినిమా హిట్ చేసినందుకు నాకు గిఫ్ట్ రావాలి కానీ, నేనే నిర్మాతకు ఇస్తున్నా” అంటూ అనిల్ సరదాగా వాపోయారు. 15 కోట్ల రూపాయల విలువ చేసే కారు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ‘రాజాసాబ్’ రికార్డులు గల్లంతు!
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ పవర్ ముందు యంగ్ హీరోలు సైతం తలవంచక తప్పడం లేదు. కేవలం ప్రీమియర్ల ద్వారానే 1.5 మిలియన్ డాలర్లు సాధించి చిరు కెరీర్ బెస్ట్ రికార్డు క్రియేట్ చేశారు.
మూడు రోజుల క్రితమే రిలీజ్ అయిన ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్ కలెక్షన్లను కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ దాటేయడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. 70 ఏళ్ల వయసులో నేటి తరం స్టార్ హీరోలకు చిరు చుక్కలు చూపిస్తున్నారు!
400 కోట్ల క్లబ్‌లోకి మెగాస్టార్?
గత సంక్రాంతికి 300 కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి, ఈసారి 400 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. మొదటి రోజు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అది పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. పందెం ఓడిపోయి కారు ఇస్తున్నా.. సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు అనిల్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

