సినిమా వార్తలు

సంక్రాంతి అల్లుడు చిరంజీవే: ప్రభాస్‌ను సైతం పక్కకు నెట్టి.. మెగాస్టార్ మానియా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘సంక్రాంతి’ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద స్టార్ల మధ్య జరిగే మహా సంగ్రామం. ఈ పోరులో ఎందరో హీరోలు వస్తుంటారు, పోతుంటారు.. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం లెక్కే వేరు. పోటీ ఎంత కఠినంగా ఉన్నా, ప్రత్యర్థులు ఎవరైనా సరే.. ‘సంక్రాంతి విన్నర్’ అంటే తన పేరే ఉండాలని చిరు మరోసారి నిరూపించారు.

హ్యాట్రిక్ విక్టరీ.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ స్వీప్!

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి చిరంజీవి ఇప్పటివరకు మూడుసార్లు సంక్రాంతి బరిలోకి దిగారు. ఆ మూడు సార్లూ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ కొట్టారు.

2017 – ఖైదీ No. 150:

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరు రీ-ఎంట్రీ ఇస్తూనే బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’ వంటి హిట్ సినిమాల పోటీలోనూ ఈ చిత్రం ఏకంగా ₹100 కోట్ల షేర్ మార్కును దాటి, అప్పట్లో ‘నాన్-బాహుబలి’ రికార్డును క్రియేట్ చేసింది.

2023 – వాల్తేరు వీరయ్య:

మాస్ రాజా రవితేజతో కలిసి చిరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ నుంచి గట్టి పోటీ ఎదురైనా, ‘వీరయ్య’ వసూళ్ల సునామీ సృష్టించింది. వీరసింహారెడ్డి కంటే దాదాపు రెట్టింపు కలెక్షన్లతో సంక్రాంతి మొగుడిగా నిలిచాడు.

2026 – మన శంకర వరప్రసాద్ గారు:

ఈ ఏడాది సంక్రాంతి పోటీ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ‘ది రాజా సాబ్’తో బరిలో ఉన్నా, చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అందరినీ వెనక్కి నెట్టేశారు.

ప్రభాస్ ‘రాజా సాబ్’కే చుక్కలు చూపించిన మెగాస్టార్!

ఈ ఏడాది ప్రభాస్ ‘ది రాజా సాబ్’ భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, నెగటివ్ టాక్‌తో కుప్పకూలిపోయింది. మరోవైపు, ‘మన శంకర వరప్రసాద్ గారు’ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ₹100 కోట్ల క్లబ్‌లో చేరి, ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ప్రభాస్ సినిమాతో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వంటి యంగ్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మాత్రం మెగాస్టార్‌కే పడింది. ‘రాజా సాబ్’ కలెక్షన్ల కంటే ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు దాదాపు రెట్టింపు దిశగా సాగుతున్నాయి.

వయసు పెరిగినా వాడి తగ్గలేదని, బాక్సాఫీస్ లెక్కల్లో ఇప్పటికీ తానే నెంబర్ 1 అని చిరు మరోసారి స్పష్టం చేశారు. చిరంజీవి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద బాస్ ఈజ్ బ్యాక్ కాదు.. బాస్ ఈజ్ ఆల్వేస్ దేర్!

Similar Posts